Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేడ్చల్‌లో భారీ విత్తన స్కామ్.. రూ.2.5 కోట్లు సీజ్!

మేడ్చల్‌లో భారీ విత్తన స్కామ్.. రూ.2.5 కోట్లు సీజ్!

Big TV Live 3 weeks ago

Medchal Seeds: స్వేచ్ఛ బ్యూరో: విత్తన అక్రమాలపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదుయ్యాయ. అనుమతుల్లేకుండా శీతలీకరణ గిడ్డంగిలో నిల్వ చేసిన విత్తనాలు, ఒప్పందం లేకుండా ప్రాసెసింగ్ యూనిట్ లో తమ విత్తనాలుగా ప్యాక్ చేసి, అమ్మడానికి తీసుకువచ్చిన వేరే కంపెనీ విత్తనాల ఘటనలకు సంబంధించిన వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసులు నమోదయ్యాయి.

ఇందుకు సంబంధించిన వివరాలను మండల వ్యవసాయ అధికారి మాధవ రెడ్డి శనివారం వెల్లడించారు. మేడ్చల్ పారిశ్రామిక వాడలోని గుబ్బా శీతల గిడ్డంగిలో వివిధ కంపెనీలకు చెందిన వివిధ రకాల విత్తనాలు నిల్వ చేశారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే శీతలగిడ్డంగి యాజమాన్యం కూడా అనుమతి పత్రాలను పరిశీలించిన తర్వాత నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. నిల్వ చేసిన కంపెనీలకు ఎలాంటి అనుమతుల్లేకుండానే విత్తనాలు నిల్వ చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అధికారులు శీతల గిడ్డంగిలో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో 2వేల కిలోల మిర్చి, మొక్కజొన్న, వరి విత్తనాలను నిల్వ చేసినట్టు గుర్తించారు. ఈ విత్తనాలు మెగా సీడ్స్, ఎన్ఆర్, హైగ్రో, పోరేజ్, మాస్టర్ అగ్రికల్చర్, శ్రీరామ్ సీడ్స్, వారాహి, వివంటాకు కంపెనీలకు చెందిన విత్తనాలుగా తేల్చారు. నిల్వ చేసిన విత్తనాల విలువ రూ.2 కోట్లు ఉంటుందని ఏవో మాధవరెడ్డి. తెలిపారు. ఈ మేరకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో..ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సమృద్ధి ప్రాస్సింగ్ యూనిట్లో యూలింక్ అగ్రిటెక్ పేరుతో న్యూజివీడ్ విత్తనాలు ప్యాక్ చేసి, విక్రయించడానికి సిద్ధం చేస్తున్నట్టు అధికారులకు వచ్చిన సమాచారంతో ప్రాసెసింగ్ యూనిటి పై దాడి చేశారు. ఈ దాడిలో న్యూజీవీడ్ విత్తనాలను తాము కొనుగోలు చేసి, తమ పేరుతో విక్రయించుకోవాలంటే అవసరమైన ఒప్పంద పత్రాలు ఉండాల్సి ఉంటుంది. కానీ వారి వద్ద ఎలాంటి పత్రాలు లేనట్టు అధికారులు గుర్తించారు. ప్రాస్సింగ్ యూనిట్లో పేరుమార్చి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షల విలువైన 30 మెట్రిక్ టన్నుల న్యూజీవీడు విత్తనాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఆ కంపెనీపై కేసు నమోదు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పెళ్లి బైక్ ఇవ్వలేదని భార్యను చంపి, భర్త ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live