Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఫిక్స్?ఎంపీ సీటు ఖాయమైనట్లేనా?

మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఫిక్స్?ఎంపీ సీటు ఖాయమైనట్లేనా?

Big TV Live 1 month ago

Chiranjeevi Reentry :అచ్చిరాని పాలిటిక్స్ కి రాం రాం అన్న మెగాస్టార్ మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా ? త్వరలో ap నుండి భర్తీ కానున్న 4 రాజ్య సభ సీట్లలో ఒకటి చిరు దక్కించుకోబోతున్నాడా..?

తమ్ముడి బాటలోనే అన్న కూడా ఇపుడు ఆంద్రా రాజకీయాలపై పట్టు సాధించబోతున్నాడా అంటే ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం అవుననే అనిపిస్తుంది.

అసలు విషయంలోకి వెళ్తే .. త్వరలో దేశవ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న సందర్భంగా వాటి భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెల్సిందే.అయితే వీటిలో ముఖ్యంగా ap నుండి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలని ఎవరు భర్తీ చేస్తారా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారంతా.

మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ

ఏపీ నుంచి జూన్ 26వ తేదీన పదవీకాలం ముగియనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ స్థానాల భర్తీ కోసం జూన్ 18వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నాలుగు స్థానాలు ఏపీలో మారిన కూటమి సమీకరణాల నేపథ్యంలో ఎవరికి దక్కబోతున్నాయనే ఉత్కంఠ కొనసాగుతుండగానే, ఫిల్మ్ నగర్ నుంచి ఒక సెన్సేషనల్ గాసిప్ ఫిలిం సర్కిల్స్ లో తెగ సర్క్యులేట్ అవుతుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఈసారి రాజ్యసభ సీట్ దక్కబోతోందనే వార్త ఇప్పుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది.

ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమై

గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆపై కాంగ్రెస్‌లో విలీనం చేసి, 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం చిరంజీవికి ఉంది. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమై, కేవలం సినిమాలకే పరిమితమైన మెగాస్టార్, ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి భారీ బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు.

also read :150 మిలియన్ల వ్యూస్.. గ్లోబల్ వైడ్‌గా షేక్ చేస్తున్న 'ఆయా షేర్'.. నేచురల్ స్టార్ సరికొత్త హిస్టరీ

ఇక ఈ మధ్యే పద్మవిభూషణ్ పురస్కారం అందుకోవడంతో పాటు, ఏపీలో కూటమి విజయం వెనుక మెగా ఫ్యామిలీ సపోర్ట్ స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం మరియు బీజేపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉండటంతో, మెగాస్టార్‌ను గౌరవపూర్వకంగా పార్లమెంట్‌కు పంపేందుకు తెరవెనుక భారీ వ్యూహం నడుస్తోందని ఇన్ సైడ్ టాక్.

జూన్ 1వ తేదీన నోటిఫికేషన్

ఎన్నికల సంఘం ప్రకటించిన అధికారిక టైమ్‌లైన్ ప్రకారం, జూన్ 1వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లని సమర్పించేందుకు జూన్ 8 ఆఖరి తేదీ కాగా, జూన్ 9న పరిశీలన, జూన్ 11న ఉపసంహరణ గడువు ముగుస్తుంది. జూన్ 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరిపి, అదే రోజు రాత్రి లోపు ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 20 నాటికి ఈ ప్రక్రియ మొత్తం ముగిసిపోతుంది. ఈ తక్కువ సమయంలోనే ఎవరెవరు బరిలో నిలుస్తారు అనే దానిపై కూటమి నేతలు ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

also read :రామ్-అనిల్ రావిపూడి కాంబో.. క్రేజీ ప్రాజెక్టా? లేక డిజాస్టర్ ఫార్ములానా?

ప్రస్తుతం చిరంజీవి బాబీ కొల్లి సినిమాతో తెగ బిజీగా గడిపేస్తున్న సంగతి తెల్సిందే.ఒక వేళ వినిపిస్తున్న ఈ వార్తే నిజమైతే మాత్రం ఇటు సినిమాల్లో నటిస్తూనే, అటు జాతీయ స్థాయిలో మరోసారి మెగాస్టార్ వాయిస్ వినిపించడానికి రెడీ అయిపోయినట్టే అనుకోవాలి. ఇక చిరు లాంటి టవరింగ్ పర్సనాలిటీని పెద్దల సభకు పంపేందుకు కూటమిలోని మిగతా పార్టీలు కూడా ఆసక్తిని చూపిస్తున్నట్టు సమాచారం.

మెగా ఫ్యాన్స్‌కు మాంచి కిక్కిచ్చే న్యూస్

ఇక ప్రస్తుతం ఏపీలో కూటమికే అధిక mla లు ఉన్నారు కాబట్టి ఈ నాలుగు స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్ళడం పక్కా. ఆ క్రమంలోనే కూటమిలోని జనసేన లేదా బీజేపీ కోటా కింద చిరంజీవి పేరును ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు ఇది మాంచి కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పాలి.

also read :ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న రజనీకాంత్ పాత బస్ కండక్టర్ ఐడీ కార్డ్!

ఏది ఏమైనా జూన్ మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉంది. మరి 2012 ఏప్రిల్‌లో మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన మెగాస్టార్, సరిగ్గా 14 ఏళ్ల తర్వాత మళ్లీ అదే జూన్ నెలలో పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇస్తాడా లేక వినిపించిన వార్తలు గాసిప్స్ గానే మిగిలిపోతాయా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live