Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా 'పెద్ది'తో ఏం చేశాడంటే?

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా 'పెద్ది'తో ఏం చేశాడంటే?

Big TV Live 2 weeks ago

Ram Charan Acting: భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ పెద్ది సినిమా ఇప్పటికే ప్రీమియర్ పూర్తి చేసుకని మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను ప్రీమిచర్ చూసిన ప్రేక్షకులు మాత్రం చరణ్ గురించ అసలు పొగడకుండా ఉండలేకపోతున్నారు.

ఎందుకంటే టాలీవుడ్ లో మెగాస్టార్ గా నెంబర్ ఒన్ స్థానంలో ఉన్న చిరు కూడా ఇలాంటి నటన ఎప్పుడూ చేసి ఉండరు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్ నుంచి వచ్చే వారిని ఎవరిని పకలరించినా.. మెగాస్టార్ ను చరణ్ మించి పోయాడు అంటూ బల్లగుద్ది చెబుతున్నారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

నట విశ్వరూపం.. చిరు రికార్డులకే సవాల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ, యాక్టింగ్, డాన్సుల్లో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్‌ను పోల్చడం సామాన్యమైన విషయం కాదు. కానీ 'పెద్ది' సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. చిరంజీవి తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినప్పటికీ… 'పెద్ది' చిత్రంలో చరణ్ చూపించిన నటన, పలికించిన హావభావాలు, ఎమోషనల్ సీన్స్ టాలీవుడ్‌లోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

థియేటర్ల నుండి బయటకు వస్తున్న ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతూ ఇలా అంటున్నారు. “ఇలాంటి నటన చిరు కూడా ఎప్పుడూ చేసి ఉండరు. కొన్ని సీన్లలో చరణ్ యాక్టింగ్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. తండ్రిని మించిన కొడుకు అని చరణ్ నిరూపించుకున్నాడు.”

సినిమా హైలైట్స్

దర్శకుడు రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్‌ను, ఆయనలోని నటుడిని వందకు వంద శాతం వాడుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్‌లో చరణ్ నటన థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలోంచి లేచి నిలబడేలా చేస్తోంది. కళ్ళతోనే పలికించిన పవర్ ఫుల్ ఎమోషన్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. మునుపెన్నడూ లేని విధంగా ఊరమాస్, స్టైలిష్ యాక్షన్ కలయికతో చరణ్ అదరగొట్టారు. బేస్ వాయిస్‌తో చరణ్ చెప్పిన డైలాగులు థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి.

Read also-Brahmamudi Serial Today Episode June 4th 'బ్రహ్మముడి' సీరియల్‌: సీఈవోగా ఇందు - ప్రకటించిన రేఖ

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట

టాక్ పరంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా 'పెద్ది' చిత్రం సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, ఈ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. మొత్తానికి, 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. చిరంజీవి నటనను సైతం మర్చిపోయేలా చరణ్ చేసిన ఈ 'నట విశ్వరూపం' థియేటర్లలో చూడాల్సిందేనని ప్రేక్షకులు బల్లగుద్ది చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live