Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేం తిడితే ఓకే.. ఎవరు తిట్టినా కేసే! మోడీని తిడితే ఊరుకోం.. ఆయన మన ప్రధాని..!

మేం తిడితే ఓకే.. ఎవరు తిట్టినా కేసే! మోడీని తిడితే ఊరుకోం.. ఆయన మన ప్రధాని..!

Big TV Live 1 week ago

తిడితే మేమే తిట్టాలి. అది మా జన్మ హక్కు. కాంగ్రెస్‌కు ఉన్న ఈ హక్కును లాక్కుని తిట్టే హక్కు ఎవరికీ లేదు. మేము ఇక్కడ తిడతాం.. అక్కడ పొగుడుతాం. అదంతే.

అది పార్టీ లైన్‌. అయినా మావి జాతీయ పార్టీలు. తిట్టుకున్నా.. కొట్టుకున్నా.. కేసులు పెట్టుకున్నా.. ఈడీ రైడింగులు చేసుకున్నా.. అవన్నీ మాకు మాకు మధ్య మామూలే. మధ్యలో మీరెవరు?

అయినా మీకు కొంచెమైనా సోయి ఉన్నదా? ఆయన ఎవరు? ఈ దేశ ప్రధాని. ప్రధాని అంటే ఎవరు.. ప్రైమ్ మినిష్టర్‌. ప్రైమ్ మినిష్టర్ అంటే ఎవరు.. దేశానికి పెద్ద. బడేమియా. మరి అలాంటి బడేమియాను తుక్కు తుక్కు తిడతారా..? మార్ఫింగులు చేసి మజా చేసుకుంటరా? ఆయన వీడియో సందేశాలను గేలి చేస్తూ మీమ్స్ చేస్తరా? ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఆయనతో ఆడుకుంటరా? జెన్‌జీకి దడుసుకున్నడని చీప్‌గా గంజిలో ఈగలెక్క తీసేస్తరా?

జంతర్ మంతర్ దగ్గర బెదిరిస్తే జడుసుకోవడానికి ఆయనేమన్నా తుతుంబర్‌గాడనుకుంటున్నరా? మోడీ. ప్రధాని మోడీ. నమో. నమో నమామి మోడీ జీ! మొన్న చూడలేదా పక్క రాష్ట్రం ఏపీలో మా బాబుగోరు ఎంతలా పొగిడారో మోడీని.

ఏపీ ఏపీ మొత్తం లేచి నమో నమామి.. అని మోడీకి సాష్టంగపడిన అద్భుత దృశ్యాలు మీరు చూడలేదా.. ఆయనను పట్టుకుని ఇష్టమొచ్చినట్టు తిడతారా? తాతా అంటారా? తైతక్క లాడతారా? మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తారా..? అర్థరాత్రులు వీడియోలేందీ అని చిన్న పిల్లల్ని అడిగినట్టు అడుగుతారా? ఫ్రెన్స్ .. అని అన్నందుకు మీకు ఏం నొప్పైంది..? ఆయన వయస్సులో పెద్దవాడే కానీ.. మనసు మాత్రం ఇంకా చిన్న పిల్లోడి దగ్గరే ఆగిపోయింది. అందుకే జెన్‌జీని ఉద్దేశించి మిత్రో అని హిందీలో అనకుండా ఇంగ్లీష్‌లో అయితే ఎక్కువ మందికి అర్థమవుతుందని ఫ్రెన్స్‌…. అని అన్నాడు.

ఆహా తెలియకడుగుతా ఇందులో తప్పేముందిరా బై! దీన్ని కూడా మీరు ట్రోలింగ్ చేయాల్నా? టెలి ఫ్రాంప్ట్ లేకుండా మీడియా ముందు మాట్లాడే సత్తా లేదంటారా? మరి ఉన్న దేశాలన్నీ తిరిగి.. ఉన్న వేశాలన్నీ వేశాడుగా.. కళ్లేమైనా మీవి.. కాకులెత్తుకు పోయాయా? కాకులెత్తుకు పోయాయా అంటా?

కాకపోతే ట్రంప్ మామతో కూడా హిందీలో మాట్లాడిండు. ఆయనకు అర్థమైతే ఎంత కాకపోతే ఎంత? మనకు అర్థం కావాలె కదా. మన దేశం కోసం ఆయన ఎంత తపన పడుతుండో తెలుస్తలేదా? అందుకే ఆయనపై పల్లెత్తు మాట మాట్లాడినా.. కేసులు పెడతం.. జైళ్లు నింపుతాం. స్టేషన్ల చుట్టు చెప్పులరిగేలా తిరిగేలా చేస్తాం.. మేము మాత్రమే తిడతాం. అది జన్మహక్కు. వింటే భారతం వినాలి .. తింటే గారెలే తినాలి.. మోడీని తిడితే మేమే తిట్టాలి…! అంతే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live