Smartphone Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు జూన్ నెల పండగే అని చెప్పవచ్చు. ఈ నెల మొదటి వారమే అదిరిపోయే మార్కెట్లోకి 3 పవర్ ఫుల్ ఫోన్లు అడుగుపెట్టబోతున్నాయి.
అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీలు, అధునాతన సాఫ్ట్ వేర్ తో ఇవి పక్కా ఎంటర్ టైన్ చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆయా ఫోన్లకు సంబంధించి ఫీచర్లు లీకై.. యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ మూడు ఫోన్లు ఏవి? వాటి ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్
మోటోరోలా నుండి వస్తున్న ఈ ప్రీమియం ఫోన్ జూన్ 4న విడుదల కానుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో వెనుక వైపు మూడు 50MP కెమెరాలతో పాటు 3.5x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఇస్తున్నారు. 6.8-అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 6,500 mAh బ్యాటరీ, డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్పీకర్లు, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఇది రాబోతోంది. దీని ధర దాదాపు రూ.50 వేల పైనే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
షావోమి 17టి
ఫోటోగ్రఫీ అంటే ప్రాణమిచ్చేవారి కోసం షావోమి సంస్థ జూన్ 4న ‘షావోమి 17టి’ని లాంచ్ చేస్తోంది. ప్రొఫెషనల్ కెమెరా బ్రాండ్ ‘లైకా’ (Leica) ట్యూన్ చేసిన కెమెరాలతో పాటు 5x టెలిఫోటో లెన్స్ ఈ ఫోన్ సొంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 8500-ఆల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేసే ఈ మోడల్‌లో 6,500mAh భారీ బ్యాటరీ, 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను తక్కువ ధరకే అందించనుండటం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
మొబైల్ డేటా సగం రోజుకే అయిపోతోందా? అయితే ఈ 4 ట్రిక్స్ మీ కోసమే!
లావా బోల్డ్ ఎన్2 5జీ
దేశీయ బ్రాండ్ లావా నుండి జూన్ 3న అమెజాన్ వేదికగా ఈ ఫోన్ విడుదలవుతోంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా వినియోగదారుడికి అవసరమైన ఫీచర్లనే అందించే ‘నో నాన్సెన్స్ ఫోన్’గా దీన్ని కంపెనీ ప్రమోట్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే సరికొత్త ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని ఇవ్వడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. మీరు గనుక కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ వారం లాంచ్ అయ్యే ఈ పవర్‌హౌస్ డివైజ్‌లపై ఓ కన్నేసి ఉంచాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

