Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

Big TV Live 2 weeks ago

New Phone vs Refurbished Phone: కొత్త స్మార్ట్‌ ఫోన్ చేతికి రాగానే ఆ సంతోషమే వేరు! సీల్డ్ బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ వాడుతుంటే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

కానీప..మీరు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న ఆ ఫోన్ నిజంగా బ్రాండ్ న్యూ ఫోనేనా? లేక సీల్ మార్చి అమ్మేసిన పాతదా లేదా రీఫర్బిష్డ్ ఫోనా? ఇటీవల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో రీ-ప్యాక్ చేసిన ఫోన్లను కొత్తవిగా నమ్మించి అమ్మే మోసాలు ఎక్కువయ్యాయి. అందుకే.. మీ ఫోన్ కొత్తదా కాదా అని కొన్న వెంటనే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం!

కొత్త స్మార్ట్‌ ఫోన్ కొన్నప్పుడు కొన్ని చిన్న సీక్రెట్ కోడ్స్, సిస్టమ్ సెట్టింగ్స్ ఉపయోగించి అది ఒరిజినల్ కొత్త ఫోనా లేక వాడి ప్యాక్ చేసినదా అనేది క్షణాల్లో కనిపెట్టవచ్చు. ఎలాగంటే ?

1. ప్యాకేజింగ్ :

మొబైల్ బాక్స్ అందుకోగానే ముందుగా సీల్ గమనించండి. ఒరిజినల్ కంపెనీ సీల్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. బాక్స్ పై ఉన్న టేప్ కట్ చేసినట్లుగా ఉన్నా, రీ-సీల్ చేసినట్లు అనిపించినా అనుమానించాల్సిందే. అలాగే బాక్స్ వెనుక ఉన్న మోడల్ నేమ్, కలర్, రామ్, స్టోరేజ్ వివరాలు మీరు ఆర్డర్ చేసిన దానికి సరి పోలాయో లేదో చెక్ చేయండి.

2.ఐఎంఈఐ నంబర్ వెరిఫికేషన్:

1.ఫోన్ కొత్తదా కాదా అని చెప్పడానికి అత్యంత ప్రామాణికమైనది ఐఎంఈఐ నంబర్. మీ ఫోన్ డైలర్ ఓపెన్ చేసి *#06# టైప్ చేయగానే స్క్రీన్‌పై ఐఎంఈఐ నంబర్లు కనిపిస్తాయి. ఈ నంబర్లను బాక్స్ పై ఉన్న ఐఎంఈఐ నంబర్‌తో పోల్చి చూడండి. రెండూ ఒకేలా ఉండాలి. భారత ప్రభుత్వానికి చెందిన 'సంచార్ సాథీ' పోర్టల్‌లోకి వెళ్లి మీ ఐఎంఈఐ నంబర్ ఎంటర్ చేస్తే.. ఆ ఫోన్ మోడల్ , బ్లాక్‌లిస్ట్ కాలేదని నిర్ధారించుకోవచ్చు.

3.ఐఫోన్ ఇలా చెక్ చేయండి:

మీరు ఐఫోన్ కొన్నట్లయితే.. అది కొత్తదా, రీఫర్బిష్డ్ డెవిసా లేదా రీప్లేస్‌మెంట్ ఫోనా అనేది మోడల్ నంబర్ చూసి చెప్పేయవచ్చు.

Settings > General > About లోకి వెళ్ళండి.ముందుగా అక్కడ ఉన్న Model Number గమనించండి. తర్వాత మోడల్ నంబర్ 'M' తో ప్రారంభమైతే అది 'బ్రాండ్ న్యూ ఫోన్'. మోడల్ నంబర్ 'F' తో ప్రారంభమైతే అది 'రీఫర్బిష్డ్ ఫోన్'. మోడల్ నంబర్ 'N' తో ప్రారంభమైతే అది యాపిల్ సర్వీస్ సెంటర్ ఇచ్చిన 'రీప్లేస్‌మెంట్ ఫోన్'.

4. ఆండ్రాయిడ్ ఫోన్ టెస్టింగ్ :

ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్ హార్డ్‌వేర్, బ్యాటరీ సైకిల్స్ ఆధారంగా కని పెట్టవచ్చు.

డయాగ్నస్టిక్ కోడ్స్: చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో *#*#4636#*#* డైల్ చేయడం ద్వారా 'Usage Statistics' చూడవచ్చు. ఫోన్ గతంలో ఎంతసేపు ఉపయోగించారో ఇక్కడ కనిపిస్తుంది.

కంపెనీ టెస్టింగ్ మోడ్: శామ్‌సంగ్ ఫోన్లలో *#0*# టైప్ చేసి డిస్‌ప్లే, సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయవచ్చు.

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

5. ఫిజికల్ కండిషన్ & బ్యాటరీ సైకిల్స్:

ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్, కెమెరా లెన్స్ ,ఛార్జింగ్ పోర్ట్ చుట్టూ చిన్న గీతలు ఉన్నాయో లేదో లైట్ వెలుగులో సరిగ్గా చూడండి. అలాగే టైప్-సి పోర్ట్‌లో దుమ్ము ఉంటే.. అది వాడిన ఫోన్ అని అర్థం. కొత్త ఫోన్ ఆన్ చేయగానే సెటప్ పేజీ రావాలి గానీ, నేరుగా హోమ్ స్క్రీన్ రాకూడదు.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మోసపోకుండా అసలైన కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live