Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

Big TV Live 4 days ago

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. ఆమే వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కొత్తగా ఎన్నికైన ముగ్గురు బీజేపీ రాజ్యసభ సభ్యులుకు మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

జూన్‌ నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షినటరాజన్ పిటీషన్ చెల్లదంటూ తన నామినేషన్‌ను తప్పుగా తిరస్కరించారంటూ గతంలో ఆమేపై ఆరోపణలు చేశారు.

నోటీసులు జారీ..

అయితే ఈ పిటిషన్ పై మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ బెంచ్, జస్టిస్ బి.పి. శర్మ ధర్మాసనం విచారణ జరిపారు. దీంతో ముగ్గురు బీజేపీ రాజ్యసభ ఎంపీలు తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్, రిటర్నింగ్ అధికారి, మరియు ఎన్నికల సంఘంకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 11 కు కోర్టె వాయిదా వేసింది.

కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మహిళ మృతదేహంతో బంధువుల ధర్నా!

బీజేపీ ఆరోపణలు..

తెలంగాణలోని ఒక కోర్టు కేసుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని బీజేపీ నాయకుల ఆరోపించారు. దీంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను జూన్ 9న ఎన్నికల అధికారి రద్దు చేశారు. దీంతో ఎన్నికల అధికారి నిర్ణయం పై తొలుత సుప్రీంకోర్టును మీనాక్షి నటరాజన్ ఆశ్రయించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టును మీనాక్షి నటరాజ్ ఆశ్రయించారు.

దౌల్తాబాద్‌లో షాకింగ్ ఘటన.. గడ్డి మందు పిచికారీతో 8 ఎకరాల వరి పంట ధ్వంసం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live