Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరు ఆట మొదలుపెట్టారు.. ముగింపు ప్రజలే ఇస్తారు.. మరో సంచలన వీడియోతో ప్రకాష్ రాజ్!

మీరు ఆట మొదలుపెట్టారు.. ముగింపు ప్రజలే ఇస్తారు.. మరో సంచలన వీడియోతో ప్రకాష్ రాజ్!

Big TV Live 6 days ago

Prakash Raj:గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న అంశం ప్రశ్న రావణ్ అరెస్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ..

బండబూతులు తిట్టాడనే నెపంతో ఇప్పటికే నాలుగు సార్లు ఈయనను అరెస్టు చేయగా.. అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచిన ప్రతిసారీ కోర్టు ఈయనకు బయలు ఇచ్చింది. అయితే ఇలా కోర్టు బెయిల్ ఇవ్వడం.. మళ్ళీ ఇతనిపై కేసు ఫైల్ చేయడం పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) తన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వీడియోలు విడుదల చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొన్నటికీ మొన్న ప్రశ్న రావణ్ అరెస్టుపై మండిపడుతూ.." ఎందుకు ఇలాంటి సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు" అంటూ మండిపడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రశ్న రావణ్ కి బెయిల్ లభించినా.. మళ్లీ అతనిపై "యూఏపీఏ" చట్టం కింద కేసు ఫైల్ చేసి పోలీసుల కోర్ట్ ముందు హాజరు పరచడంతో.. 18 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్ మరో వీడియోని రిలీజ్ చేశారు.

ఆట మొదలు.. ప్రజలే ముగింపు ఇస్తారు - ప్రకాష్ రాజ్

ఏంటో.. అసలు ఏం జరుగుతోందో.. నాలుగు సార్లు వరుసగా తప్పుడు కేసులు పెట్టి.. కోర్టు బెయిల్ ఇస్తే యూఏపిఏ వాడి ఒక యూట్యూబర్ ను రిమాండ్ లోకి పంపిస్తారా? అంటే యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం జరిగింది. ఇది ప్రశ్నించే గొంతులను నొక్కాడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి కరెక్ట్రససినేషన్.. ఆల్రెడీ జనసైనికులు ఏ ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరు ఏం చేస్తారు.. వాడి ఫోన్ మీ దగ్గర ఉంది .అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను వక్రీకరించి దానిని లీక్ చేస్తూ, ప్రశ్న రావణ్ ను ఇబ్బంది పెడుతూ.. ఆ మూలంగా ఆయనకు అండగా నిలుచున్న వారిని.. మరీ ఎన్నో ప్రశ్నించే గొంతులను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా.. దిగజారండి.. దిగజారుతూ ఉండండి.. ఎంత కిందకు దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు.. సరే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారితో మీ ఆట మొదలైంది.. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు.. ఆట మొదలు.." అంటూ ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

ఇదిలా ఉండగా మరొకవైపు ప్రకాష్ రాజ్ మాటలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పొలిటికల్ ట్వీట్ పై అదే స్థాయిలో బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. తీవ్ర పదజాలంతో విమర్శలు గుర్తించారు. "ఎవరి మెప్పు కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నావు అంటూ ప్రశ్నించారు.. బండ్ల గణేష్ తన ట్వీట్ లో నువ్వు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా.. ముందు నీ స్థాయి, నీ వ్యక్తిత్వం, నీ బాధ్యత ఏంటో ఒకసారి అద్దంలో చూసుకుని.. నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం అనిపించుకోదు.. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు , దేశ భవిష్యత్తు నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. మీ అహంకారం, అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతుంది. కాస్త వినయం నేర్చుకో.. హద్దులు దాటి ప్రవర్తిస్తే ఉన్న పరువు కూడా పోతుంది" అంటూ కౌంటర్ ఇచ్చారు.

స్పందించిన పవన్ కళ్యాణ్..

ప్రశ్న రావణ్ అరెస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .." వ్యక్తిగత స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్ర్యం అనేది అపరిమితమైనది కాదు.. కుటుంబ సభ్యులను, ఆడవారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం క్రిమినల్ నేరం" అంటూ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live