Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరు ఎంత గింజుకున్నా తీసుకునేది లేదు.30 ఏళ్లు దాటిన ప్లేయర్లు మాకొద్దు

మీరు ఎంత గింజుకున్నా తీసుకునేది లేదు.30 ఏళ్లు దాటిన ప్లేయర్లు మాకొద్దు

Big TV Live 1 week ago

Ajit Agarkar On Shami, Bhuvi: 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా జట్టును సిద్ధం చేస్తోంది బీసీసీఐ (BCCI).

ఇందులో భాగంగానే అజిత్ అగార్కర్ (Ajit Agarkar), గౌతమ్ గంభీర్ ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసం వరకు… బాగా ఆడిన వాళ్లను తుది జట్టులో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్ ( Bhuvneshwar Kumar), మహమ్మద్ షమీలకు (Mohammed Shami ) ఊహించని షాక్ ఇచ్చాడు అజిత్ అగార్కర్. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లకు ప్రాధాన్యత ఇవ్వబోమని బాంబు పేల్చాడు. కేవలం కుర్ర క్రికెటర్లకు మాత్రమే భవిష్యత్తులో అవకాశాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. 30 సంవత్సరాలు దాటిన ప్లేయర్లకు జట్టులో అవకాశాలు రావడం కష్టమేనని స్పష్టం చేశారు. దీంతో అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌలర్లకు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగకుండా మాస్టర్ ప్లాన్

అవకాశాల కోసం భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ ఎదురుచూపులు

2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న కసితో భువనేశ్వర్ కుమార్ అలాగే మహమ్మద్ షమీలు ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా వీళ్ళ గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్ లలో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత వీళ్ళ అడ్రస్ గల్లంతు అయింది. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడు అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వీళ్లకు ఛాన్సులు ఏమాత్రం ఇవ్వడం లేదు.

మీరు ఎంత గింజుకున్నా తీసుకునేది లేదు…30 ఏళ్లు దాటిన ప్లేయర్లు మాకొద్దు

భువనేశ్వర్ కుమార్ అలాగే మహమ్మద్ షమీ భవిష్యత్తుపై తాజాగా అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కీలక ప్రకటన చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఇందులో అందరూ కూడా యంగ్ స్టార్లు అని అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం 15 మంది కుర్ర క్రికెటర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని ట్రైనింగ్ ఇస్తున్నట్లు వివరించారు. దీంతో 35 సంవత్సరాలు దాటిన మహమ్మద్ షమీ (Md. Shami) అలాగే భువనేశ్వర్ కుమార్ రీ -ఎంట్రీకి ఛాన్స్ లేదని మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వాళ్లు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.

Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live