Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిస్టర్ ఎక్స్ ఓటీటీ రివ్యూ..ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?

మిస్టర్ ఎక్స్ ఓటీటీ రివ్యూ..ఇంతకీ సినిమా ఎలా ఉందంటే?

Big TV Live 1 week ago

MR X OTT review :సాధారణంగా స్పై థ్రిల్లర్స్ అంటే జేమ్స్ బాండ్ లేదా మన లోకల్ విక్రమ్, సర్దార్ సినిమాలను ఊహించుకుంటాం. కానీ, ఈ MR X ని కాస్త హిస్టారికల్ టచ్‌తో, మరికాస్త యాక్షన్ డోస్‌తో మిక్స్ చేసి వదిలారు దర్శకుడు మను ఆనంద్.మరి ఏప్రిల్ 17వ తేదీన విడుదలై, నెల రోజులు తిరక్కముందే ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దామా!

కథ విషయానికి వస్తే..

కథ 1960ల నాటి ఆ పవర్ ఫుల్ న్యూక్లియర్ డివైస్ చుట్టూ తిరుగుతుంది. అప్పట్లో చైనా మీద నిఘా పెట్టడానికి ఇండియా, అమెరికా కలిసి చేసిన ఆ ప్రయోగం విఫలమై, ఆ డివైస్ మిస్ అయిపోతుంది. కట్ చేస్తే, ప్రజెంట్ టైమ్ లో ఆ డివైస్ మళ్ళీ బయటకి రావడంతో దేశానికి ముప్పు పొంచి ఉంటుంది. దాన్ని కాపాడటానికి రా (RAW) టీమ్ లీడర్ గౌతమ్ (ఆర్య), డైరెక్టర్ ఇందిరా వర్మ (మంజు వారియర్) రంగంలోకి దిగుతారు. అసలు ఈ మిషన్‌లో 'మిస్టర్ ఎక్స్' పాత్ర ఏంటి? ఆ అపరిచిత వ్యక్తి దేశాన్ని కాపాడాడా లేదా అనేదే సినిమా .

విశ్లేషణ

అప్పట్లో హిమాలయాల్లో పోగొట్టుకున్న ఆ అణు పరికరం ఇప్పుడు ఉగ్రవాదుల చేతికి చిక్కితే దేశం పరిస్థితి ఏంటి? అనే టెన్షన్ బాగానే మెయింటైన్ చేశారు. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్ల పరిచయం, కథా గమనం మీద దృష్టి పెట్టడం వల్ల కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కానీ వన్స్ సెకండాఫ్ మొదలైందంటే ఇక స్పీడ్ పెంచుతుంది. ముఖ్యంగా ట్విస్టుల మీద ట్విస్టులు పడుతుంటే, ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఒక మంచి మైండ్ గేమ్ అని అర్థమవుతుంది. దర్శకుడు మను ఆనంద్ కి ఇది వరకు 'ఎఫ్.ఐ.ఆర్' లాంటి సాలిడ్ హిట్ ఉంది, ఆ మార్క్ టేకింగ్ ఈ సినిమాలో కూడా కొన్ని చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది.

also read :సూర్య 'వీరభద్రుడు' ఎలా ఉందంటే…ఇప్పటికైనా హిట్ కొట్టడా ?

అయితే, ప్రతి సినిమాలో లాగే ఇందులోనూ కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ అన్నప్పుడు మ్యూజిక్ పరంగా 'విక్రమ్' లాంటి ఇంపాక్ట్ ఆశిస్తాం. కానీ బిజీయం అంతగా కిక్ ఇవ్వలేదు. అలాగే కొన్ని యాక్షన్ బ్లాక్స్ 'మిషన్ ఇంపాజిబుల్' లేదా రీసెంట్‌గా వచ్చిన 'పఠాన్' సినిమాలను గుర్తుకు తెస్తాయి. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే మాత్రం విజువల్స్ అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది, లొకేషన్స్ అన్నీ పక్కా హాలీవుడ్ స్టైల్‌లో కనిపిస్తాయి. దేశభక్తిని కేవలం డైలాగ్స్ తో కాకుండా, ఎమోషన్స్ తో చూపించడం బాగుంది.

నటీనటులు
సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా 'సుప్రీమ్ స్టార్' శరత్ కుమార్ గురించి మాట్లాడాలి. నిజంగా ఆయనే ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఆర్య హీరోగా ప్రమోట్ చేసినా, స్క్రీన్ మీద మిస్టర్ ఎక్స్‌గా శరత్ కుమార్ ఇచ్చే ఎంట్రీ, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే "ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్" అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఆయనకు దక్కిన మోస్ట్ పవర్ ఫుల్ రోల్ ఇదే. ఆర్య తన మ్యాచో లుక్‌తో, సిక్స్ ప్యాక్ బాడీతో రా (RAW) ఏజెంట్ గౌతమ్ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి.'సార్పట్టా' తర్వాత ఆర్యకు ఆ రేంజ్ ఫిజిక్ డిమాండ్ చేసే సినిమా ఇదే కావడం విశేషం. ఇక మంజు వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందిరా వర్మగా ఆమె చూపించిన మెచ్యూరిటీ, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె చేసే ఫైట్స్ ప్రేక్షకులకు పెద్ద సర్ ప్రైజ్.

ప్లస్ పాయింట్స్

  • శరత్ కుమార్ విశ్వరూపం
  • ఆర్య మ్యాచో లుక్
  • ట్విస్టులు & యాక్షన్

మైనస్ పాయింట్స్

  • సాగదీత ఫస్టాఫ్
  • మ్యూజిక్ డిజప్పాయింట్
  • లాజిక్ మిస్

చివరగా ..

చివరగా చెప్పాలంటే, 'మిస్టర్ ఎక్స్' ఒక పక్కా కమర్షియల్ ప్యాకేజీ. బోర్ కొట్టకుండా సాగే స్పై డ్రామా. మీరు గనుక కార్తీ 'సర్దార్' లేదా కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలను ఇష్టపడితే, ఈ సినిమా కూడా మీకు నచ్చేస్తుంది. శరత్ కుమార్ గారి స్వాగ్ కోసం, ఆర్య యాక్షన్ కోసం డెఫినెట్‌గా ఒక లుక్ వేయొచ్చు.ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా గట్టి యాక్షన్ పడాలి అనుకుంటే, ఈ మూవీ మీ వాచ్ లిస్ట్‌లో ఉండాల్సిందే.

MR X review and rating 2.75/5

also read :KD మూవీ రివ్యూ.. సౌండ్ ఎక్కువ.. సరుకు తక్కువ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live