Dailyhunt
Mitchell Starc : నిద్రపోయిన అంపైర్‌..అతిపెద్ద నో-బాల్ వేసిన మిచెల్ స్టార్క్

Mitchell Starc : నిద్రపోయిన అంపైర్‌..అతిపెద్ద నో-బాల్ వేసిన మిచెల్ స్టార్క్

Big TV Live 3 days ago

Mitchell Starc : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ టోర్నమెంట్ లో దాదాపు 75% మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals vs Chennai Super Kings) మధ్య ఆసక్తికర ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ ( Mitchell Starc ) వేసిన నో-బాల్ (Mitchell Starc bowls no-ball )వైరల్ గా మారింది.

Raghu Sharma Letter: 33 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెటర్‌…ఇంతకు ఎవరీ రఘు శర్మ ?

నిద్రపోయిన అంపైర్‌..అతిపెద్ద నో-బాల్ వేసిన మిచెల్ స్టార్క్

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద నో-బాల్ ను మిచెల్ స్టార్ కు వేసినప్పటికీ అంపైర్ నిద్రపోయాడు. దాన్ని గుర్తించలేకపోయాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా దీనిపై ఎలాంటి అప్పిల్ చేయలేదు. ఈ క్రమంలోనే మిచెల్ స్టార్ కు వేసిన నో-బాల్ వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్ లో చాలా తప్పిదాలు జరుగుతున్నప్పటికీ అంపైర్లు మాత్రం గుర్తించడంలేదంటూ సీరియస్ అవుతున్నారు. వెంటనే దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఐపీఎల్ బ్రాండ్ దెబ్బతినే ప్రమాదం ఉందంటూ చురకలు అంటిస్తున్నారు ఫ్యాన్స్.

ఇది ఇలా ఉండగా మిచెల్ స్టార్క్ మొన్నటి వరకు ఐపీఎల్ ఆడలేదు. తన ఇంజురీ కారణంగా సీజన్ మొదటి భాగంలో జరిగిన మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల కాలంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరిన మిచెల్ స్టార్క్ అద్భుతంగానే రాణిస్తున్నాడు. ఇక నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ సందర్భంగా నాలుగు ఓవర్లు వేశాడు మిచెల్ స్టార్క్. ఒక వికెట్ తీయలేదు కానీ 30 పరుగులు సమర్పించుకున్నాడు.

ఢిల్లీపై విక్టరీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న 48వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పైన విక్టరీ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరవ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచులు గెలవగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఏడవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ కంటే చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live