Dailyhunt
మిత్రధర్మం పాటించి.. విజయ్ ఆఫర్ కాదని! తమిళనాడు కాంగ్రెస్‌లో చర్చ.!

మిత్రధర్మం పాటించి.. విజయ్ ఆఫర్ కాదని! తమిళనాడు కాంగ్రెస్‌లో చర్చ.!

Big TV Live 1 week ago

మిళనాడులో రెండు జాతీయ పార్టీలకు అవకాశాలు లేకుండా పోయాయి. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్‌, బీజేపీలు మిత్రపక్షంగా ఉండి కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందే తప్ప..

అక్కడ ఈ రెండు పార్టీలు దిశానిర్దేశం చేసే స్థితిలో లేవు. అవి ఇప్పట్లో సాధ్యం కూడా అయ్యేలా లేవు. కానీ విజయ్ రూపంలో కాంగ్రెస్‌కు మంచి ఆఫర్ వచ్చింది. దాదాపు 60 సీట్ల వరకు కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు విజయ్ సిద్దపడ్డారు. కానీ రాహుల్ దీన్ని కాదనుకున్నారు. అంతకు ముందు జరిగిన పరిణామాలు కూడా దీనికి కారణమయ్యాయి.

టీవీకే పార్టీ ఏర్పాటైన తరువాత జరిగిన బహిరంగ సభ దుర్ఘటనలో విజయ్‌పై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్.. విజయ్‌ను కలిసి పరామర్శించారు. ఇది డీఎంకేకు మింగుడుపడలేదు. ఇండియా కూటమిలో భాగమై ఉన్న డీఎంకే .. రాహుల్ చర్యలను వ్యతిరేకించింది. అప్పటికే పొత్తుల విషయంలో విజయ్ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసే లేదని ముందే చెప్పారు విజయ్‌. బీజేపీ చర్చలకు ఆహ్వానించినా ససేమిరా అన్నారు. వాస్తవానికి అక్కడ బీజేపీకి ఏమాత్రం స్పేస్‌లేదు. తమిళ తంబీలు బీజేపీకి దాని సిద్దాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసిన బీజేపీని అక్కడి వాళ్లు బద్ద శత్రువుగా కూడా చూస్తారు.

దీనిపై పెద్ద ఉద్యమమే నడిపారు. ఆ చరిత్ర తమిళులకు ఉంది. మాతృభాషపై అపారగౌరవంతో ఉండే తమిళులు ఈ విషయంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. బీజేపీతో కలిస్తే వచ్చే ఓట్లు కూడా రావని విజయ్‌కు తెలుసు. దీనికి తోడు విజయ్ తండ్రి.. మొదటి నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు.కాంగ్రెస్‌తో దోస్తానా విషయంలో సానుకూల ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. దీంతో పొత్తు పెట్టుకుని వెళ్తే.. 60 సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామనే ఆఫర్ వచ్చినా.. స్టాలిన్ కోసం రాహుల్ దీన్ని సున్నితంగానే వ్యతిరేకించినట్టు తెలిసింది. దీంతో డీఎంకే .. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఓ 28 సీట్లు ఇచ్చింది. నిమిత్త మాత్రంగానే తన ఉనికి చాటుకున్నది కాంగ్రెస్‌.

అదే విజయ్‌తో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లలో గెలిచి తమిళ రాజకీయాలలో పార్టీ పరంగా బలోపేతం అయ్యేవాళ్లమనే డిస్కషన్ ఇప్పుడు నడుస్తున్నది. తమిళ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు చోటు దక్కడం లేదు. విజయ్ పార్టీతో కాంగ్రెస్‌కు కొంత బలం చేకూరేదనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎదగనీయరని, అధికార పార్టీ టీవీకే.. దాని ఉనికే లేకుండా చేస్తుందనే అభిప్రాయాలూ అక్కడ వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది.

అన్నాడీఎంకేకు కూడా ఓట్లు, సీట్లు తగ్గడానికి బీజేపీతో జత కట్టడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీని వల్ల విజయ్ టీవీకేనే లాభపడ్డది. ఓ వైపు మెజారిటీ ఓట్లు అధికార డీఎంకేవి లాక్కున్న టీవీకే.. అన్నాడీఎంకేను కూడా వదల్లేదు. అందుకే ఆ స్థాయి ఫలితాలు వచ్చాయనే విశ్లేషణ కొనసాగుతోంది. సిద్దాంతాలు, మిత్రధర్మం కాంగ్రెస్‌కు ముఖ్యమని, సీట్లు… అధికారం కాదని టీవీకే ఆఫర్‌ను కాదన్న అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి ప్రచారం చేస్తున్నారు తమిళ కాంగ్రెస్ తంబీలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live