Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Monsoon Preparedness: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: వానొస్తే కాపాడేందుకు హైడ్రా అదిరిపోయే ప్లాన్..!

Monsoon Preparedness: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: వానొస్తే కాపాడేందుకు హైడ్రా అదిరిపోయే ప్లాన్..!

Big TV Live 1 week ago

Monsoon Preparedness: స్వేచ్ఛ బ్యూరో: వర్షాకాలం సమీపిస్తుండటంతో హైదరాబాద్ మహానగరాన్ని వరద ముప్పుు నుంచి కాపాడేందుకు హైడ్రా బీ రెడీ అంటుంది. గతేడాది కురిసిన భారీ వర్షాల సమయంలో నగరంలోని అనేక కాలనీలు, రహదారులు నీట మునిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు చర్యలకు హైడ్రా శ్రీకారం చుట్టింది.

హైడ్రా, జీహెచ్ఎంసీ, మల్కాజ్ గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, జలమండలి, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. నగరంలో ముంపు సమస్యలు, వాటర్ లాగింగ్, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా హైడ్రా గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు హైడ్రా అమీర్ పేటలోని మైత్రివనం వద్ద, అలాగే కృష్ణానగర్ ముంపునకు శాశ్వత పరిష్కారాన్ని చేకూర్చేందుకు పలు చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే.

గతేడాది భారీ వర్షాల సమయంలో..

పలు చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్లకు శాశ్వత పరిష్కార మార్గాలను కూడా హైడ్రా సిఫార్సులు చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే నగరాన్ని సిద్ధం చేసే దిశగా హైడ్రా విస్తృత స్థాయిలో కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలిసింది. గతేడాది భారీ వర్షాల సమయంలో ఎక్కడెక్కడ ముంపు సమస్యలు తలెత్తాయి? ఏ కాలనీలు ఎక్కువగా నీట మునిగింది? ఎక్కడెక్కడ రోడ్ల మీదుకు భారీగా వరద నీరు చేరిందన్న అంశాలపై గత కొద్ది రోజులుగా హైడ్రా కమిషనర్ రంగనాధ్ నేరుగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, ప్రత్యేక అధ్యయనం నిర్వహించినానంతరమే ఈ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం ఎంఎంసీ కమిషనర్ సృజనతో ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ రంగనాధ్ సమావేశం నిర్వహించారు.

గతంలో వరదలు..

జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, రెవెన్యూ శాఖల నుంచి సమాచారం సేకరించి ముంపు ప్రభావిత ప్రాంతాల జాబితాను సిద్ధం చేసినట్లు, వాతావరణ శాఖ నుంచి రెయిన్ అలర్ట్ రాగానే, డీఆర్ఎఫ్ బృందాలను క్షేత్ర స్థాయికి పంపేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. బస్తీలు, లోతట్టు కాలనీలు, చెరువుల పరిసర ప్రాంతాలు, నాలాల పక్కన ఉన్న నివాస ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. గతంలో వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఈ సారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా వర్షాకాలం సహాయక చర్యలు కోసం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు మొత్తం వర్షాకారం రౌండ్ ది క్లాక్ పని చేసేలా కంట్రోల్ రూమ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్ల తెలిసింది.

Also read: కొండాపురంలో గ్రామ పంచాయతీ పైసలు మాయం.. కార్యదర్శిపై ఎంపీడీవోకు ఫిర్యాదు..!

వాటర్ లాగింగ్ పాయింట్ల గుర్తింపు వేగవంతం

చినుకు పడితే చాలు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లు చిన్న సైజు చెరువులను తలపిస్తుంటాయి. ఈ రకంగా వాటర్ లాగింగ్ అయ్యే ప్రాంతాలను గుర్తించే ప్రక్రియను హైడ్రా ఇటీవలే వేగవంతం చేసినట్లు తెలిసింది. ఈ వాటర్ లాగింగ్ కారణంగా మెయిన్ రోడ్లలో కిలోమీటర్ల పొడువున ట్రాఫిక్ స్తంభించిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవటంతో పాటు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నట్లు హైడ్రా గుర్తించింది. ప్రతి వర్షాకాలంలో నీరు నిలిచే కూడళ్లు, అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారులు, కాలనీల ప్రవేశ మార్గాలను గుర్తించి ప్రత్యేక ప్రత్యేకంగా మ్యాపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిసింది. రోడ్లపై నీటి నిల్వ ఎక్కువ సేపు ఉండకుండా, వేగంగా ప్రవహించి క్షణాల్లో క్లియర్ అయ్యేలా స్టార్మ్ వాటర్ డ్రైన్ల సామర్థ్యాన్ని హైడ్రా స్టడీ చేస్తుంది. ఎక్కడైనా డ్రైన్లు పూడ్చుకుపోయినా, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నా వెంటనే తొలగించే చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతుంది.

ప్రత్యేక ప్రణాళికలు..

నాలాలు, కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త, వ్యర్థాలను తొలగించే డీసిల్టింగ్ పనులను ఇప్పటికే ముమ్మరం చేసిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీని సమన్వయం చేసుకుని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారు లక్షా 88 వేల క్యూబిక్ మీటర్లు, అంటే 67 వేల టన్నుల పూడికను బయటకు తీసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. వర్షపు నీరు ఒకే లాగింగ్ కాకుండ బయటకు ప్రొవహించేంనుకు వీలుగా అందుబాటులో ఉన్న ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసేందుకు హైడ్రా సిద్దమైంది. నీటిని తొలగించేందుకు హై కెపాసిటీ మోటార్లు, పంపింగ్ సెట్‌లు, ఎర్త్ మూవింగ్ మెషినరీ, క్రేన్లు, జేసీబీలు వంటి యంత్రాలను అందుబాటులో ఉంచాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్న హైడ్రా

వర్షాకాలంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిస్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హైడ్రా ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. భారీగా వర్షపు నీరు నిలిచిన చోట ఆ నీరు ప్రవహించేందుకు వీలుగా స్టార్మ్ వాటర్ డ్రెయిన్ మూతలు తెరిచి ఉంచటం, అది తెలియక స్థానికులు రాకపోకలు సాగిస్తూ, ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కొల్పొయిన ఘటనలు జరిగిన నేపథ్యంలో హైడ్రా ఈ సారి అలాంటి వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద అటు వైపు కాలినడకన, వాహానాలపై వచ్చే స్థానికులను అలర్ట్ చేసే, వారు సేఫ్ రూట్ లో ప్రయాణించేందుకు వీలుగా సహకరించేందుకు ప్రత్యేక నిఘా టీమ్ లను కూడా ఏర్పాటు చేసే దిశగా హైడ్రా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

హైడ్రా అంతర్గతంగా..

నగరంలోని వివిధ జోన్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలను సిద్దం చేస్తుంది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో చెట్లు కూలిపోవడం, గోడలు కూలడం, రోడ్లు దెబ్బతినడం, కాలనీలు ముంపునకు గురికావడం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా బృందాలను సిద్ధంగా ఉంచేందుకు హైడ్రా అంతర్గతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా పునరావాస కేంద్రాలను గుర్తించే పనిలో హైడ్రా ఇప్పటి నుంచే నిమగ్నమైనట్లు సమాచారం.

తెలంగాణ మంత్రి వర్గ విస్తరనకు ఖర్గే గ్రీన్ సిగ్నల్.. చాన్స్‌దక్కే ముగ్గురు లీడర్లు వీళ్లే..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live