Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగిసిన జీ.వీ.నారాయణరావు అంత్యక్రియలు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

ముగిసిన జీ.వీ.నారాయణరావు అంత్యక్రియలు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

Big TV Live 3 weeks ago

Chiranjeevi:చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల మరణాలు అభిమానులను తీవ్ర అఘాతంలోకి నెట్టి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ప్రముఖ సీనియర్ నటీమణి షావుకారు జానకి(Sowcar Janaki) కన్నుమూయగా..

రెండు రోజుల క్రితం ప్రముఖ సీనియర్ నటుడు జీ.వీ.నారాయణరావు(GV narayana rao) మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆగస్టు 27న ముగియగా.. ఈయన అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జీ.వీ. నారాయణ రావుతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

జీ.వీ.నారాయణ రావుతో చిరంజీవికి ఆత్మీయ అనుబంధం..

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ సినీ నటుడు జీవీ నారాయణరావు.. అనారోగ్య సమస్యలతో ఇటీవల తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. తను అప్పటికే ఇన్స్టిట్యూట్లో సీనియర్.. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు.. తను వచ్చి తన అనుభవాలను మాతో పంచుకునేవారు. అలా మాకు దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లం ఎదిగినప్పుడు నాకు ఒక స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు..” నేను నిర్మాతగా నిలబడాలనుకుంటున్నాను .నువ్వు సినిమాలు చేయాలని” నన్ను అడిగారు. అలా ఆయన నిర్మాణంలో నేను రెండు చిత్రాలు చేశాను . నా సినిమాల్లో తనకు నటుడిగా కూడా అవకాశం వచ్చేలా చేశాను. అలా మా అనుబంధం కొనసాగుతూ వచ్చింది.

అదే ఆఖరి మాట అవుతుందనుకోలేదు – చిరంజీవి

అయితే యాదృచ్ఛికంగా ఒక పది రోజుల క్రితం.. “నేను ఒక సినిమా చేశాను. మంచు పల్లకి ఇన్స్పిరేషన్ తో ఐదుగురు కుర్రవాళ్ళు.. పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారో అనే కథతో ఒక సినిమా చేశాను. ట్రైలర్ లాంఛ్ చేయాలి. మీ సహకారం ఉంటే అందరికీ బాగుంటుంది “అని ఆయన అడిగారు. కచ్చితంగా చేస్తానని చెప్పాను. పైగా ఆ క్షణంలో ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగుదాం రమ్మని అడిగారు. బహుశా తన ఆఖరి చిత్రం అదేనేమో.. ఆ సమయంలో మేము చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పాను. పైగా ఆల్ ద బెస్ట్ కూడా ఆయనకు చెప్పాను. కానీ అదే మాట శాశ్వతంగా గుడ్ బై అవుతుందని అనుకోలేదు. ఎక్కడున్నా సరే నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులు కూడా నా కుటుంబ సభ్యులే .. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ జీవి నారాయణరావుతో ఉన్న తనకు వున్న అనుబంధాన్ని చిరంజీవి పంచుకున్నారు.

జీ.వీ.నారాయణ రావు సినీ ప్రస్థానం..

దర్శకుడు కే బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రంతో 1976లో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు . సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది . పైగా చిరంజీవి హీరోగా నటించిన దేవాంతకుడు, యముడికి మొగుడు వంటి చిత్రాలకు జీవీ నారాయణరావు నిర్మాతగా వ్యవహరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live