Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!

Big TV Live 1 week ago

GOBOULT Astra Neo: ప్రస్తుతం మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ హవా నడుస్తోంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు లేదా మ్యూజిక్ వినేటప్పుడు ఇయర్‌బడ్స్ ప్రతి ఒక్కరి అవసరంగా మారిపోయాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బౌల్ట్’మార్కెట్లోకి తీసుకొచ్చిన అద్భుతమైన బడ్జెట్ ఇయర్‌బడ్స్ ‘GOBOULT Astra Neo’. కేవలం రూ.1099 ధరకే లభిస్తున్న ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ మంచి ఫీచర్లు కలిగి ఉన్నాయి. అంతే కాకుండా దీనిలోని స్పెషికేషన్లు ఈ ధరలో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

70 గంటల భారీ ప్లేటైమ్ , పవర్‌ఫుల్ బ్యాటరీ:

ఈ ఇయర్‌ బడ్స్ మెయిన్ హైలైట్ దీని అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్. కాంపాక్ట్ సైజులో ఉన్నప్పటికీ.. ఇది మొత్తం 70 గంటల భారీ ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి దీన్ని రోజూ వాడినా చాలా రోజుల పాటు ఛార్జింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఒ కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ప్రయాణాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పాటలు వినొచ్చు, అంతే కాకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

4 మైక్ ENC టెక్నాలజీతో స్పష్టమైన కాల్స్:

ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు చుట్టుపక్కల వచ్చే శబ్దం, ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఇందులో 4 మైక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీని పొందుపరిచారు. దీనివల్ల రద్దీగా ఉండే రోడ్లపై లేదా బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ అవలికి స్పష్టమైన హెచ్‌డీ కాల్ ఆడియో లభిస్తుంది. ఎదురుగా మాట్లాడేవారికి మీ గొంతు ఎలాంటి అడ్డుతగుళ్లు లేకుండా చాలా స్పష్టంగా, లౌడ్‌గా వినిపిస్తుంది.

లేటెస్ట్ బ్లూటూత్ 5.4, ప్రీమియం సౌండ్:

ఈ డివైజ్‌లో లేటెస్ట్.. బ్లూటూత్ వెర్షన్ 5.4 టెక్నాలజీని వాడారు. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్‌కు ఇయర్‌ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి.అంతే కాకుండా కనెక్షన్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఆడియో లాగ్ సమస్య లేకుండా గేమింగ్ ఆడేందుకు , సినిమా చూసేందుకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇయర్‌ బడ్స్‌లోని పవర్‌ఫుల్ డ్రైవర్లు డీప్ బేస్, పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, వాల్యూమ్ అడ్జస్ట్ చేయడం వంటివి చాలా ఈజీగా చేయవచ్చు. తక్కువ ధరలొనే ప్రీమియం సౌండ్ క్వాలిటీ కూడా దీని మరో స్పెషాలిటీ అని చెప్పొచ్చు.

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

ఆకర్షణీయమైన ధర, ప్రత్యేక ఆఫర్ వివరాలు:

మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్ల ఇయర్‌ బడ్స్‌తో పోలిస్తే.. బౌల్ట్ అస్త్రా నియో ధర చాలా తక్కువగా ఉంది. ఈ ‘మోడల్ హెడ్‌సెట్ ప్రస్తుత ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో బంపర్ ఆఫర్‌ భాగంగా కేవలం రూ. 1,099 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన, ఎక్కువ రోజులు బ్యాటరీ వచ్చే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live