సాllywood:సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా ఒకరు ఎదిగారు అంటే పక్క వారు.. వారిని ఎప్పుడు ఎలా తొక్కేద్దామా అని చూసే వారిని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమను తాము ప్రమోట్ చేసుకోవాల్సింది పోయి ఎదుటివారిని కించపరిచి, వారిని ఇబ్బందులకు గురిచేసివారిని మానసికంగా హింసించడానికి డబ్బులు ఇచ్చి మరీ ప్రత్యేకంగా పీఆర్ టీమ్ లను పెట్టుకుంటున్నారు అంటూ ఎంతోమంది ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే .
ఈ మధ్యకాలంలో పి.ఆర్ టీమ్స్ సెలబ్రిటీలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శిస్తూ వారిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అలా పక్కవాడు బాగుపడితే ఓర్వలేక వారి పతనానికి కారణమవుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తనను కూడా నాశనం చేయాలని చూశారని , తన సక్సెస్ ఓర్వలేక తనపై కుట్ర చేశారు అంటూ ఒక డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాపై కుట్ర చేశారు..
ఆయన ఎవరో కాదు గౌతమ్ వాసుదేవ్ మీనన్. చిత్ర సీమలో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన ఈ మధ్యకాలంలో నటుడిగా కూడా సత్తా చాటుతూ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తున్నారు. అలాంటి ఈయన దర్శకత్వంలో 2017లో విక్రమ్ హీరోగా ప్రారంభించిన చిత్రం ధృవ నక్షత్తిరం. అలా ప్రారంభమైన ఈ సినిమా నేటికీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ వ్యవహారం కోర్టుకి కూడా చేరింది.గతవారం విచారణ జరిపిన కోర్టు ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేయడానికి అనుమతినిచ్చింది . ఇక దీనిపైనే గౌతమ్ మీనన్ స్పందించారు.
నన్ను ఆపడం మీ తరం కాదు..
తాజాగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు.ముఖ్యంగా నా కెరియర్ను దెబ్బతీయాలని చూసారు. అయితే కోర్టు న్యాయం చేసింది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు న్యాయస్థానం అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఈ చారిత్రాత్మక తీర్పు భవిష్యత్తులో అనేక చిత్రాలకు ఆదర్శంగా ఉంటుంది . ఎవరైతే నాపై కుట్ర పన్ని ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని చూసారో వారందరికీ చెబుతున్నాను కచ్చితంగా నన్ను ఆపడం మీ తరం కాదు” అంటూ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకలా చేశారు? వారెవరు ? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక దీనికి తోడు తన కెరీర్ ను దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ గౌతమ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసాయి.
HBD Trisha: త్రిష మెచ్చిన హీరో, హీరోయిన్ ఎవరంటే?
విడుదలకు సిద్ధమవుతున్న గౌతమ్ మీనన్ మూవీ..
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాను జూన్ 15వ తేదీ లోపు విడుదల చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. అలా వచ్చిన కలెక్షన్లను ఒక ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేయాలని తీర్పునిచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఈనెల ఆఖరిలో అనగా మే 27వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. మరి దాదాపు 9 ఏళ్ళుగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఎట్టకేలకు కోర్టు సహాయంతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

