Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న తాప్సీ.. డైరెక్టర్ ఎవరంటే?

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న తాప్సీ.. డైరెక్టర్ ఎవరంటే?

Big TV Live 2 weeks ago

Taapsee Pannu :మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ మోడల్ తాప్సీ పన్ను (Taapsee Pannu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

మోడల్ నుండి నటన వైపు అడుగులు వేసిన ఈమె ఒక్కో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు లభించలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ బాట పట్టింది. ఇక అక్కడ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు దాదాపు 4 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. 2022లో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాలో నటించిన ఈమె.. మళ్లీ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది.

4 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ..

తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే తాప్సీ టాలీవుడ్ లో ఒక గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi).. తాజాగా నటి తాప్సితో ఒక హారర్ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్గా ‘కొరియన్ కనకరాజు’ అనే ఇండో కొరియన్ కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు మేర్లపాక గాంధీ.

డైరెక్టర్ ఎవరంటే?

అందులో భాగంగానే ఇప్పుడు ఆయన తన తదుపరి ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన కొరియన్ కనకరాజు సినిమా మంచి విజయం అందుకోవడంతో ఇప్పుడు అదే జోనర్లో మరో హారర్ మూవీ ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారట. ఇక ఈ సినిమా కోసం తాప్సీని సంప్రదించగా కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇకపోతే బాలీవుడ్లో స్టార్ గా ఎదిగిన తాప్సి ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది . మరి ఈ హారర్ ఎంటర్టైనర్ ఈమె కెరియర్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

తాప్సీ సినిమాలు..

తాప్సీ పన్ను తాజాగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం గాంధారి సెప్టెంబర్ 3 2026న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా విడుదల కాబోతోంది. హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. మరి నేరుగా ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో తాప్సీ అంధురాలైన తల్లి పాత్రలో నటిస్తోంది. కూతుర్ని కాపాడుకోవడానికి ఒక తల్లి ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంది.. చైల్డ్ ట్రాఫికింగ్, మాఫియా పై ఎలా పోరాటం సాధించింది? అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కథా పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live