Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Big TV Live 2 weeks ago

Sree Mukhi:ఇటీవల కాలంలో తెలంగాణ నేపథ్యంతో వస్తున్న కథలకు, పాటలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా జానపద గేయాలను కాస్త రీమిక్స్ చేసి డిజైన్ చేస్తున్న తీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.

అలా ఇప్పటికే ఎన్నో పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు నాని (Nani) ది ప్యారడైజ్ (The Paradise) నుంచి వచ్చిన ఫోక్ మాస్ సాంగ్ ‘యేషనాగుల కట్టమీద ‘ పాట కూడా యూట్యూబ్లో ట్రెండింగ్ లో నిలుస్తోంది. నాని – కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట యూట్యూబ్లో మోత మోగిస్తోంది.

నాని ఫోక్ సాంగ్ కి శ్రీముఖి అదిరిపోయే స్టెప్పులు..

ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈపాటే వినిపిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా యూట్యూబ్లో యూట్యూబర్స్ కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ యాంకర్ కం నటి శ్రీముఖి(Sreemukhi ) కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ అలరించింది. ఈ మేరకు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియో రిలీజ్ చేస్తూ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిమ్ కి వెళ్లిన ఈమె అక్కడి నుండే ‘యేష నాగుల కట్టమీద’ పాటకు ఒక రేంజ్ లో డాన్స్ చేసి అదరగొట్టేసింది . వైట్ కలర్ టీ షర్టు , బ్లూ కలర్ మినీ షార్టు ధరించి, పోనీటైల్ తో శ్రీముఖి సెప్టెంబర్ ఎనర్జీ అంటూ మాస్ స్టెప్స్ తో అదరగొట్టేసింది. శ్రీముఖి డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన నెటిజన్లు లవ్ ఎమోజీలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ఒక అభిమాని అయితే ఏకంగా..” హీరోయిన్ మెటీరియల్ రా మా అక్క. సైడ్ క్యారెక్టర్ చేస్తుంటే మంచిగా అనిపించట్లేదు. మంచి లవ్ స్టోరీ చెయ్ అక్క.. ఆల్ ద బెస్ట్ ” అంటూ ఒక అభిమాని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మొత్తానికి అయితే నాని మాస్ ఫోక్ డాన్స్ తో శ్రీముఖి అదరగొట్టేసింది.

సినిమాలు, షోలతో బిజీగా మారిన శ్రీముఖి..

శ్రీముఖి విషయానికి వస్తే ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత తోడికోడలి పాత్రలో నటించి, కొన్ని కొన్ని సన్నివేశాలలో సమంతనే డామినేట్ చేసే రేంజ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో హోస్ట్గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో జడ్జెస్ కు భారీగా సహాయపడుతోంది.. మరొకవైపు సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది.

సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్..

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం ది ప్యారడైజ్.. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా నటించారు. సోనాలి కులకర్ణి , మోహన్ బాబు, రాఘవ్ జుయల్, ఈశ్వరి రావు, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, ఎం ఎస్ చౌదరి ఇలా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఆయా షేర్ పాటతో పాటు ఇటీవల విడుదలైన యేష నాగుల కట్ట పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live