Rickshaw AC: ఏసీ కార్లలో తిరిగే వాళ్లకి ఎండలతో పెద్దగా ఇబ్బంది ఉండదు.కాని రిక్షాలు, ఆటోల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.
అందుకే వారికీ ఒక ac ఉండాలంటూ ఖరీదైన టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా, అతి తక్కువ ఖర్చుతో తన ప్రయాణికుల సౌకర్యం కోసం ఆ డ్రైవర్ ఆలోచించిన తీరు అద్భుతం.అవును వారి కష్టాన్ని గమనించిన ఒక సామాన్య ఈ-రిక్షా డ్రైవర్, తన మెదడుకు పదును పెట్టి చేసిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు నెట్టింటిని షేక్ షేక్ చేస్తోంది. అతడి క్రియేటివిటీ ఫిదా అయిన జనం, ఇప్పుడు అతడిని ముద్దుగా 'నడిచే ఏసీ' అని పిలుస్తున్నారు కూడా.
విషయం లోకి వెళ్తే ..
also read :రణబీర్ కపూర్ నెక్స్ట్ హోమ్ అయోధ్యలోనేనా? కోట్లు పెట్టి కొన్న స్థలం డీటెయిల్స్ ఇవే!
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్
సాధారణంగా ఎయిర్ కూలర్లలో గడ్డి పొరలను వాడుతుంటారని మనకు తెలుసు. అదే సూత్రాన్ని ఈ డ్రైవర్ తన రిక్షాకు అప్లయ్ చేశాడు . తన ఈ-రిక్షా పైన, చుట్టుపక్కల కూలర్లలో వాడే గడ్డి మ్యాట్లను (Cooler Grass Mats) అమర్చాడు. కేవలం గడ్డిని అమర్చడంతోనే ఆగకుండా, ఆ గడ్డి ఎప్పుడూ తడిచి ఉండేలా చిన్న వాటర్ పైపులను, ఒక చిన్న మోటార్‌ను కూడా సెట్ చేశాడు. రిక్షా రోడ్డుపై వేగంగా వెళ్తున్నప్పుడు, బయట నుంచి వచ్చే వేడి గాలి ఈ తడి గడ్డి గుండా ప్రయాణించి, లోపల ఉన్న ప్రయాణికులకు ఏసీ కంటే చల్లని అనుభూతిని ఇస్తోంది. ఇపుడు @ThePushpraj అనే యూజర్ X (గతంలో Twitter) వేదికగా షేర్ చేసిన ఆ రిక్షా ac వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “డిగ్రీలు లేని అసలైన ఇంజనీర్ ఇతడే” అని కొందరు పొగుడుతుంటే,అవసరం పడితే అదే మనల్ని ఇలాంటివి చేయడానికి దారి చూపిస్తుంది అంటూ మరికొంతమందికామెంట్ చేస్తున్నారు. ఢిల్లీ లాంటి నగరాల్లో ఎండ దెబ్బ నుంచి సామాన్యులను రక్షించడానికి ఇది ఒక స్మార్ట్ మరియు ఎకో-ఫ్రెండ్లీ మార్గమని అందరూ మెచ్చుకుంటున్నారు . తన కష్టం కంటే ప్రయాణికుల చల్లదనం ముఖ్యమని భావించిన ఈ డ్రైవర్ ఐడియా ప్రస్తుతం నెట్టింట ‘హాట్ టాపిక్’గా మారింది.చూడాలి ముందు ముందు ఇలాంటి క్రేజీ ఇన్వెన్షన్స్ తో ఇంకెంతమంది ముందుకు వస్తారో !
also read :దళపతి విజయ్ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ పీఠమేనా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి జోస్యం

