Patriot Movie:సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నయనతార 4 పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.
ఇక అలాంటి ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం పేట్రియాట్. మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి , మోహన్ లాల్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, దర్శనా రాజేంద్రన్, కుంచకో బోబన్, ఫహద్ ఫాజిల్, రాజీవ్ మీనటన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహేష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ , బ్లూ టైగర్స్ లండన్ బ్యానర్లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్ నిర్మిస్తున్నారు.
సెన్సార్ అభ్యంతరాలు.. రిలీజ్ డేట్ ప్రకటన..
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కోసం వెళ్లగా సినిమా చూసిన సెన్సార్ బోర్డు ప్రతినిధులు, అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై కట్ విధించినట్లు అలాగే సినిమాలోని కొన్ని పాత్రల పేర్లను మార్చాలని సూచించినట్లు సమాచారం. అలాగే కొన్ని సన్నివేశాలను తొలగించాలని ఆంక్షలు విధించారనే విషయం కూడా మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారట . ఆ పాత్ర పేరును మార్చాలి అని సెన్సార్ అధికారులు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా విలన్ పాత్ర పేరు ఒక పొలిటికల్ లీడర్ కుమారుడు పేరు ఒకేలా ఉండడంతోనే సెన్సార్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే చిత్ర బృందం మళ్ళీ మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. రీ ఎడిట్ చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో ఈ సినిమాలో మార్పులు చేసి సెన్సార్ కి తిరిగి సబ్మిట్ చేయనున్నట్లు.. అందుకే రిలీజ్ డేట్ ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వినిపించగా.. తాజాగా ఈ మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్ నయనతార స్వయంగా ప్రకటించింది.
also read:బాలయ్య 'సింహ'కు 16 ఏళ్లు.. ఆరేళ్ల విమర్శలకు చెక్.. తెలియని విషయాలెన్నో
పేట్రియాట్ విడుదల రేపే..
ఈ సినిమాను మే 1న అంటే రేపు థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని నయనతార అధికారికంగా ప్రకటించింది. నయనతార తన లుక్ ను రివీల్ చేస్తూ..” నిరీక్షణ ముగిసింది. తుఫాను మొదలు కాబోతోంది. కేవలం రేపు విడుదల మాత్రమే కాదు.. ఇదొక ఆక్రమణ.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి సిద్ధం కండి” అంటూ నయనతార ఈ పోస్టు పంచుకుంది . మొత్తానికి అయితే సెన్సార్ అభ్యంతరాలు చెప్పడంతోనే కాస్త వాయిదా పడిన ఈ సినిమా అన్ని పూర్తి చేసుకొని రేపు థియేటర్లలోకి రాబోతోంది .మరి సెన్సార్ సమస్యలతో ఇబ్బందులు పడ్డ ఈ సినిమా థియేటర్లలో రేపు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇక నయనతార విషయానికొస్తే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ బిజీగా మారింది. ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈమె ఇటీవల బాలయ్య ఎన్.బి. కే 111 మూవీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే

