Actress Trisha: మనం ఏదైనా గట్టిగా అనుకుంటే నెరవేరుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.. అలా త్రిష విషయంలో జరిగిందని తెలుస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కెరియర్ పరంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఒకానొక సమయంలో తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న త్రిష ఇప్పుడు కూడా ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయ్యారు. ఇకపోతే తాజాగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో త్రిష (Trisha)పేరు కూడా ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
నేను సీఎం అవుతాను..
ఇలా త్రిష పేరు ట్రెండింగ్ లో ఉండటానికి కారణం లేకపోలేదు .ఈమె నటుడు విజయ్(Vijay) తో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రావడమే అందుకు కారణం. ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీ(TVK Party) తరఫున తమిళనాడు ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిషకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గత పది సంవత్సరాల క్రితం ఈమె సీఎం పదవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు పది సంవత్సరాల క్రితం త్రిష ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
విజయ్ విజయం వెనుక త్రిష..
ఒక సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ..”నేను సీఎం అవుతాను ఇప్పుడు కాకపోయినా పదేళ్లకైనా తప్పకుండా సీఎం అవుతానని” చెప్పారు. ఇలా ఈమె గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా త్రిష చెప్పింది నిజమైంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్రిష ఇప్పుడు సీఎం కాకపోయినా ప్రస్తుతం తమిళనాడు సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్న నటుడు విజయ్ విజయం వెనుక త్రిష ఉందని చెప్పాలి. ఇలా త్రిష ప్రోత్సాహంతోనే విజయ్ ను వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు టార్గెట్ చేసినప్పటికీ ఈయన ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఎన్నికలలో పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు.
టీవికే పార్టీ విజయం విజయ్ ముఖ్యమంత్రి కావడం వెనుక త్రిష హస్తం ఉందని చెప్పాలి. ఇక విజయ్ ముఖ్యమంత్రి కావడంతో త్రిషకు కూడా రాజకీయాల పరంగా కీలక పదవి లభిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఎన్నికలలో విజయ్ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం సంచలనంగా మారింది.. ఇలా త్రిష పుట్టినరోజు సందర్భంగా విజయ్ పార్టీ అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకోవడంతో అతి త్వరలోనే విజయ్ త్రిష రిలేషన్ కూడా అధికారకంగా ప్రకటించబోతున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా టీవీకే అధినేత విజయ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విజయ్ భారీ విజయం… దివ్వెల మాధురి పోస్ట్ వైరల్…కోరిక నెరవేరిందంటూ!

