Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ జల ప్రళయంలో 160 మంది మృతి.. 1000 మంది మిస్సింగ్, చైనా ఎందుకు సైలెంట్ అయ్యింది?

నేపాల్ జల ప్రళయంలో 160 మంది మృతి.. 1000 మంది మిస్సింగ్, చైనా ఎందుకు సైలెంట్ అయ్యింది?

Big TV Live 2 weeks ago

Nepal Flood Updates: దేవతల భూమిగా చెప్పుకునే నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసిందా? లేక మనుషులు సృష్టించిన విధ్వంసమా? నేపాల్-టిబెట్ సరిహద్దు వెంబడి సంభవించిన ఈ ఘటనకు కారణం ఎవరు?

ఆకస్మిక వరదల్లో 750 మంది ఇప్పటికి గల్లంతయ్యారు. 160 మంది మరణించారు. ఈ వరదల వల్ల అనేక ప్రాంతాల్లో రవాణా-సమాచార మౌలిక సదుపాయాలు తీవ్రంగా నష్టం జరిగింది.

నేపాల్ జల ప్రళయం.. 160 మంది మృతి

నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటే కోశి నది సమీపంలో జల ప్రళయం పెను విధ్వంసాన్ని సృష్టించింది. నేపాల్‌ను తాకిన ఈ వినాశకరమైన వరదల్లో దాదాపు 160 మంది మరణించారు. 750 మందికి పైగా గల్లంతయ్యారు. 157 నేపాల్‌వాసులు కాగా, టిబెట్‌లో ముగ్గురు మరణించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన అనేకమంది టూరిస్టులు వరదల్లో చిక్కుకున్నారు. నేపాల్‌లో గల్లంతైన వారిలో 466 మంది విదేశీయులు, 113 మంది నేపాలీలు ఉన్నారు. వీరిలో 133 మంది భారతీయులు, 37 మంది ఎన్నారైలు ఉన్నారు.

750 మంది మిస్సింగ్, భారతీయులు 133 మంది

ఈ వరదల వల్ల అనేక ప్రాంతాల్లో రవాణా, సమాచార మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ గణాంకాల మేరకు.. 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు కొట్టుకుపోయాయి. 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్లు రహదారులు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు 30 అడుగుల ఎత్తు వరకు ఎగబాకింది. నీటి ప్రవాహానికి ఇళ్లను, వాహనాలను, ప్రభుత్వ భవనాలను కొట్టుకుపోయింది.

తొలుత ఆకస్మిక వరదలుగా భావించినా, భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి చైనా సైలెంట్‌గా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆగష్టు 26 ఉదయం నేపాల్-చైనా స్నేహ వంతెనకు-టిబెట్‌లో ఆకస్మిక వరద సంభవించిన ప్రదేశానికి మధ్య దూరం దాదాపు 20 కిలోమీటర్లు. టిబెట్ నుండి వచ్చిన ఆకస్మిక వరద.. 20 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి నేపాల్‌కు చాలా సమయం ఉంది. జల ప్రళయం గురించి ఆ సమయంలో చైనా.. నేపాల్‌కు తెలియజేసి ఉంటే తమ పౌరులను అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించేది. కానీ చైనా ఆ పని చేయలేదు.

నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8.37 గంటలకు టిబెట్‌లో భూకంపం సంభవించింది. దాని ప్రభావం అక్కడి సమీపంలోని హిమాలయ పర్వతాలపై పడింది. వచ్చిన భూకంపం 4.4 తీవ్రతో వచ్చినట్టు తెలుస్తోంది. భూకంపం వచ్చి మూడు నిమిషాల తర్వాత రెండు హిమసంపాతాలను ప్రేరేపించింది. ఒత్తిడి పెరగడంతో త్రిశూలి-భోటేకోశి నదులలో ఆకస్మిక వరదలు సంభవించాయి.

భూకంపం వల్ల హిమానీనదాలు విచ్ఛిన్నం కావడంతో జల ప్రళయానికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఒక్కసారిగా భోటే కోషి నది ద్వారా వరద నీరు టిబెట్ సరిహద్దులోని రసువా-ధాడింగ్ జిల్లాలకు అతి వేగంగా వ్యాపించింది. నేపాల్‌లో పర్వతాలు 30 డిగ్రీల మాదిరిగా ఏటవాలుగా ఉంటాయి. హిమాలయాల్లో ఏమైనా జరిగితే క్షణాల్లో దాని ప్రభావం కింద ప్రాంతాలపై పడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత.. ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

ఆ వరద కాస్త నువాకోట్, చిత్వాన్, గోర్ఖా, తనాహున్, నవల్పరాసి తూర్పు జిల్లాలకు వ్యాపించింది. రాజధాని కాఠ్మాండు నుండి సుమారు 70 కి.మీ నుండి 200 కి.మీ వరకు ఉన్న ప్రాంతాలను ప్రభావితం చేసిందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తు నేపాల్‌లో దీర్ఘకాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

గతేడాది జూలైలో చైనా పర్వతాలలోని ఎత్తైన హిమానీనదంపై ఏర్పడిన సరస్సు రసువాగఢి సరిహద్దు పాయింట్ నుండి 35 కిలోమీటర్ల ఎగువన బద్దలైంది. దాని ప్రవాహం లెంధే ఖోలా- భోటే కోషి నదుల గుండా ప్రవహించింది. సరిహద్దు దాటి 80 నుండి 100 కిలోమీటర్ల దిగువన నివసిస్తున్న ప్రజలను ప్రభావితం చేసింది. ఆనాడు ఈ ఘటన వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా పలు ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live