Nindu Noorella Saavasam Serial Today Episode: రూంలోకి వెళ్లాక కూడా మిస్సమ్మ చలి అంటూ వణుకుతుంది. అమ్మో చలి అంటూ అమర్‌ను హగ్ చేసుకుంటుంది. అమర్ ఏయ్ ఆగు హీటర్ ఆన్ చేస్తాను అంటూ వెళ్లి ఆన్ చేయబోతే..
హీటర్ ఆన్ కాదు. వెంటనే అమర్ రిసెప్షన్‌కు ఫోన్ చేసి హీటర్ పని చేయడం లేదు అని చెప్తాడు. టెక్నీషియన్‌ను పంపిస్తానని చెప్పగానే.. అమర్ వణికిపోతున్న మిస్సమ్మను చూసి ఓ మై గాడ్ తనను ఇలాగే వదిలేస్తే చలికి గడ్డకట్టుకుపోయేలా ఉంది అనుకుంటూ వెళ్లి కాళ్లు, చేతులు రఫ్ చేస్తుంటాడు. అయినా మిస్సమ్మ అలాగే వణుకుతుంది. వెంటనే అమర్, మిస్సమ్మను హగ్ చేసుకుని కిస్ చేస్తాడు. వెంటనే మిస్సమ్మ చలి తగ్గిపోయి నార్మల్ అవుతుంది. సిగ్గు పడుతుంది.
అమర్ ఇప్పుడు చలి తగ్గిందా..? అని అడగ్గానే.. మిస్సమ్మ కూడా ఎవరైనా చలి ఇలా కూడా తగ్గిస్తారా..? అని అడగ్గానే.. అమర్ చలి ఎక్కువ అయినప్పుడు ఇలాగే ఫస్ట్ ఎయిడ్ చేయాలి అని చెప్పగానే.. మిస్సమ్మ ఓహో మీరు నాకు ఫస్ట్ ఎయిడ్ చేశారా..? అని అడగ్గానే.. అమర్ కొంపదీసి రొమాన్స్ చేశాను అనుకున్నావా ఏంటి..? అనగానే.. మిస్సమ్మ నవ్వుతూ.. బయటకు వెళ్తుంది. దీంతో అమర్ ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు.. చలి అని చెప్పి బాల్కనీలోకి వెళ్తున్నావేంటి..? అంటుంటే
మిస్సమ్మ బాల్కనీలోకి వెళ్లి విండో ఓపెన్ చేస్తుంది. మంచును చూస్తూ.. హలో కాశ్మీర్ ఓయ్ మంచుకొండల్లారా..? ఇప్పుడు మీరు నన్ను చలితో భయపెట్టలేరు.. మీ మంచుతో నన్ను వణికించలేరు.. మైనస్ వన్ డిగ్రీ టూ మైనస్ వంద డిగ్రీలు అయినా సరే నాకు వెచ్చదనాన్ని ఇవ్వడానికి నా వెనక నా సూర్యుడు ఉన్నాడు. మీ చల్లదనమో ఆయన వెచ్చదనమో చూసుకుందామా..? కమాన్.. మంచు కాశ్మీర్‌కు సవాల్ అంటుంటే.. అమర్ కోపంగా ఏయ్ మెంటల్ లోపలికి రమ్మని చెప్పాను కదా..? అనగానే.. మిస్సమ్మ నేను రాను.. కమాన్ రండి అంటూ మంచును పిలుస్తుంటే అమర్ దగ్గరకు వచ్చి మిస్సమ్మను బలవంతంగా రూంలోకి తీసుకెళ్తాడు. దుప్పటి కప్పుకుని పడుకో అంటూ చెప్పగానే.. మిస్సమ్మ అమర్‌ను తన మీదకు లాక్కుంటుంది. ఇద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది.
మరోవైపు కాశ్మీర్ వచ్చిన మనోహరి కోపంగా రణవీర్‌ను తిడుతుంది. వద్దని ఎంత చెప్పినా వినకుండా కాశ్మీర్‌కు వచ్చాను. ఇక్కడ అమరేంద్ర నిన్ను లాక్ చేసి నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు తప్పా పాప గురించి ఏమీ చెప్పడు అనగానే.. రణవీర్ నేను అమరేంద్రను నమ్ముతున్నాను అనగానే.. మనోహరి అవునులే గొర్రె కసాయి వాణ్నే నమ్ముతుంది అనగానే.. రణవీర్ కూడా ఇన్నాళ్లు నేను నిన్ను కూడా నమ్మాను కదా..? అమరేంద్ర కసాయి వాడు అయితే నువ్వు కర్కోటకురాలివి..? నువ్వు చెప్పిన పనులన్నీ చేసినా కూడా నువ్వు నాకు సాయం చేయలేదు అనగానే.. మనోహరి ఇలా గొడవ పడటానిక మనం ఇక్కడకు రాలేదు అంటుంది.
దీంతో రణవీర్ నేను ఎందుకు వచ్చానో నాకు క్లారిటీ ఉంది. నువ్వే ఎందుకు వచ్చావో నీకు క్లారిటీ లేదు అని చెప్పగానే.. మనోహరి ఏం క్లారిటీ ఉంది నీకు నా గురించి నువ్వు అమరేంద్ర దగ్గర వాగడం తప్పా..? అమరేంద్ర పాప గురించి చెప్తాడు అనుకున్నావా..? అనగానే.. వాడు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా..? అంటాడు రణవీర్. దీంతో ఎలా తెలుసుకుంటావు అంటుంది మనోహరి. దీంతో రణవీర్ నువ్వు కోల్‌కత్తా ఆశ్రమంలో వదలిపెట్టిన పాపని అమరేంద్ర, అరుంధతి దత్తత తీసుకుని ఈ కాశ్మీర్ వచ్చారు. వన్ ఇయర్ వాళ్లు ఇక్కడే ఉన్నారు.. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ మీద కొడైకెనాల్ వెళ్లారు అని చెప్పగానే.. ఆ విషయం నాకు తెలుసు.. అందులో కొత్తగా నువ్వు కనిపెట్టింది ఏముంది అంటూ మనోహరి కోప్పుడుతుంది.
మరోవైపు రణవీర్, మనోహరి ఉన్న హోటల్ రూం దగ్గరకు లాల్‌సింగ్ అమర్ వెళ్లి..రిసెప్షన్‌లో రణవీర్ వైఫ్ పేరు రాయలేదని కనిపెడతారు. వెంటనే ఇద్దరూ వెళ్లి రణవీర్ వాళ్లు ఉన్న రూంల డోర్ కాలింగ్ బెల్ నొక్కుతారు. రణవీర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.

