Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nindu Noorella Saavasam Serial Today Episode September 1st  'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌: మిస్సమ్మ ప్లాన్ మొత్తం విన్న మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode September 1st 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌: మిస్సమ్మ ప్లాన్ మొత్తం విన్న మనోహరి

Big TV Live 1 week ago

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు నగల విషయంలో మనోహరిని రెచ్చగొట్టేందుకు కావాలనే మనోహరి రూం దగ్గరకు వెళ్లి మనోహరికి వినిపించేలా రాథోడ్‌, మిస్సమ్మ మాట్లాడుకుంటారు.

మిస్సమ్మ తాను అమర్ తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్తున్నానని.. పైగా ఆరు నగలు వేసుకుని వెళ్తున్నానని చెప్తుంది. పాపం మనోహరి నగలు లేకుండా వెళ్తుందేమో అని మిస్సమ్మ బాధపడినట్టు నటిస్తే.. రాథోడ్‌ ఏముంది మిస్సమ్మ ఏ గిల్టీ నగలో లేకపోతే బోసిపోయిన మెడతోనో వెళ్తుంది. అందుకు నువ్వు బాధపడటం ఏంటి అంటాడు. అయ్యో మనోహరి బోసిపోయిన మెడతో వెళ్లడం అంటే నాకు ఇష్టం లేదు రాథోడ్‌ అంటూ బాధపడినట్టు నటిస్తుంది మిస్సమ్మ.

దేనికైనా ప్రాప్తం ఉండాలి మిస్సమ్మ అంటూ రాథోడ్‌ చెప్తుంటే.. రూంలోంచి అంతా వింటున్న మనోహరి కోపంగా రాథోడ్‌ ఏ మాట్లాడుతున్నావు.. నాకు వినిపించాలని కావాలని ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నారా..? కాస్త పక్కకు వెళ్లి మాట్లాడొచ్చు కదా అంటుంది. ఆ మాటలకు మిస్సమ్మ సారీ మనోహరి నువ్వు రూంలోనే ఉన్నావా..? నేను చూడలేదు అంటూ నవ్వుకుంటుంది. రాథోడ్‌ మాత్రం మీ మాటలకు మనోహరి గారు ఫీల్‌ అయినట్టు ఉన్నారు మిస్సమ్మ అంటే.. అవును రాథోడ్‌ మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం పద అంటూ రాథోడ్‌ను తీసుకుని పక్కకు వెళ్లిపోతుంది మిస్సమ్మ.

మిస్సమ్మ, రాథోడ్‌ వెళ్లిపోయాక మనోహరి కోపంగా రూంలోకి వెళ్లిపోతుంది. వెనకే వెళ్లిన యాదమ్మ ఏంటి మనోహరి మీ ఆయనతో కలిసి బయటకు వెళ్తానన్నావు మళ్లీ రూంలోకి వచ్చావు అని అడిగితే.. ఎవరు మా ఆయన అంటూ మనోహరి కోపంగా తిడితే.. అదే నీకు కాబోయే భర్త అని యాదమ్మ అంటే వాడు నాకు డ్రైవర్‌ కూడా కాలేడు భర్త ఎలా అవుతాడు.. అయినా నువ్వు నాకో పని చేసి పెట్టాలి అని మనోహరి యాదమ్మను అడుగుతుంది. ఏం చేయాలో చెప్పు మనోహరి అంటూ యాదమ్మ అడిగితే.. భాగీ తన బీరువాలో దాచుకున్న ఆరు నగలు దొంగతనం చేయాలి. అని చెప్పగానే.. యాదమ్మ షాక్‌ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు మనోహరి దొంగతనం అనేది మా ఇంటా వంటా లేదు ఏదో మాయలు మంత్రాలు చేసుకుని బతుకుతుంటాము అంటూ చెప్తుంటే..

ఇక ఆపుతావా..? నీ సోది.. నువ్వు ఆ నగలు కొట్టేసి తీసుకొచ్చి ఇస్తే.. అందులో నీకు సగం వాటా ఇస్తాను అంటుంది మనోహరి. సగం వాటా అనేసరికి ఇంతకీ ఎలా కొట్టేయాలి ఆ నగలు అంటూ యాదమ్మ అడుగుతుంది. భాగీ బీరువాలో ఉంటాయి బీరువా బద్దలు కొట్టి నగలు కొట్టేయాలి అని చెప్తుంది. దీంతో యాదమ్మ ఏంటి మనోహరి నన్ను జైలుకు పంపించాలని ఏదైనా ప్లాన్‌ చేశావా..? అని అడుగుతుంది. నిన్ను నేను జైలుకు పంపించడం ఏంటి..? అని మనోహరి అడిగితే.. లేకపోతే ఏంటి మరి ఇంట్లో ఎవ్వరూ ఉండరు.. ఆ సమయంలో దొంగతనం జరిగితే పోలీసులు నన్నే కదా అనుమానించేది. అప్పుడు నేనే కదా జైలుకు వెళ్లేది అనగానే మరి ఏం చేయమంటావు నన్ను అని మనోహరి అడిగితే.. ఏం లేదు ఆ బీరువా తాళాలు తీసుకొచ్చి ఇవ్వు అందరూ వెళ్లిపోయాక బీరువాలో ఉన్న నగలు తీసుకొస్తాను అని చెప్తుంది యాదమ్మ.

ఇక తాళాలు ఉంటే నగలు తీసుకురావడానికి నువ్వే కావాలా.? అని మనోహరి ప్రశ్నిస్తే తాళాలు ఉన్నా కూడా నగలు కొట్టేయాలంటే కష్టమే మనోహరి.. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటుంది యాదమ్మ. అయితే సరే తాళాలు ఎలాగైనా తీసుకొచ్చి ఇస్తాను. మేము బయటకు వెళ్లాకు నగలు తీసుకొచ్చి ఇక్కడే రూంలో భద్రపరుచు నేను తిరిగి వచ్చాక కలిసి ఇద్దరం పంచుకుందాం అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. పిచ్చి మనోహరి అన్ని నగలు నా చేతిలో పడ్డాక ఇక నువ్వు నాకు భాగం ఇవ్వడం ఏంటి.. వాటన్నింటినీ తీసుకుని కోల్‌కతా వెళ్లిపోతాను అని మనసులో అనుకుంటుంది యాదమ్మ. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live