Dailyhunt
నిర్మాత ఆర్. బి. చౌదరికి నివాళులు అర్పించిన విజయ్..

నిర్మాత ఆర్. బి. చౌదరికి నివాళులు అర్పించిన విజయ్..

Big TV Live 4 days ago

TVK Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆర్. బి చౌదరి(R.B.Choudary) రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా ఈయన ప్రయాణిస్తున్నటువంటి కారు రాజస్థాన్ లో ప్రమాదానికి గురి కావడంతో అక్కడికక్కడే మరణించారు. సూపర్ గుడ్ ఫీలింగ్స్ బ్యానర్ అధినేత అయినటువంటి ఆర్. బి. చౌదరి ఆకాలమరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఈయన సినీ బ్యానర్ లో దాదాపు 90 కి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆర్.బి. చౌదరి మరణ వార్తను సినిమా సెలబ్రిటీలు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

ఆర్.బి. చౌదరికి విజయ్ నివాళులు..

ఇక ఈయన మరణ వార్త తెలిసిన పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆర్.బి. చౌదరి ఇంటికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు అలాగే మరికొందరు సోషల్ మీడియా వేదికగా నిర్మాత మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ పోస్టులు చేశారు. ఇక ఆర్బి చౌదరి భౌతికకాయం చెన్నైకి చేరుకోవడంతో చెన్నైలోనే ఈయన అంత్యక్రియలను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా నిర్మాత ఆర్.బి. చౌదరి చివరి చూపు కోసం టీవీ కే పార్టీ అధినేత విజయ్ వెళ్లారు. విజయ్ ఆర్ బి చౌదరి భౌతిక కాయానికి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

జీవాను ఓదార్చిన విజయ్..

ముఖ్యంగా హీరో జీవా(Jiiva) దగ్గర విజయ్ మాట్లాడుతూ ఆయనని హగ్ చేసుకుని ఓదారుస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆర్. బి. చౌదరి నిర్మాణంలో విజయ్ తిరుపాచి, జిల్లా అనే సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇక విజయ్ రావడానికి అంటే ముందుగా ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ కూడా చౌదరి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక విజయ్ ఎన్నికలలో విజయం సాధించిన నేపథ్యంలో హీరో జీవా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

?igsh=bTF6bnNkMjhwYThp

విజయ్ ఎన్నికలలో ఆధిపత్యంలో ఉన్న నేపథ్యంలో ఈయన పెద్ద ఎత్తున విజిల్ వేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిస్తూ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన జీవా ఇంట్లో ఒకరోజు వ్యవధిలోని తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రి మరణ వార్త తెలియగానే ఈయన ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆర్. బి చౌదరి పార్థివ దేహాన్ని సినీ ప్రముఖులు సందర్శించారు. రేపు ఈయన అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆర్.బి చౌదరి టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున వెంకటేష్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు. సుమారు 30 మందికి పైగా ఈయన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

సమంత మా ఇంటి బంగారం వాయిదా… కొత్త విడుదల తేదీ ఇదే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live