Dailyhunt
నిర్మాతలుగా సినిమాలు చేసి కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్లు..

నిర్మాతలుగా సినిమాలు చేసి కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్లు..

Big TV Live 1 week ago

Tollywood Heroine : సినీ ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్లు దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టుకుంటున్నారు. సినిమాలు హిట్ అవుతూ రెండు చేతుల సంపాదించిన చాలామంది హీరోయిన్లు పలు వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు కొన్ని బిజినెస్ లు చేస్తూ సక్సెస్ అయ్యారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం సినిమాల మీద ఉన్న అభిమానంతో సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది అయితే ఫెయిల్ అయిన వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు.. అయితే నిర్మాతలుగా మారి ఫ్లాప్ సినిమాలతో కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్లు ఉన్నారు.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో నిర్మాతలుగా మారి కోట్లు పోగొట్టుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం..

నిర్మాతలుగా మారి కోట్లు పోగొట్టుకున్న హీరోయిన్లు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు తమ అందం అభినయంతో హీరోయిన్లుగా సక్సెస్ అయ్యారు.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అయితే సినిమాల్లో వచ్చిన డబ్బులని సినిమాలకే ఖర్చు చేసి సక్సెస్ అవ్వాలని ఎంతో మంది ప్రయత్నాలు చేసారు. కానీ దురదృష్టం సెకండ్ ఇవ్వడంతో నిర్మాతలుగా సక్సెస్ అవ్వలేకపోయారు. ఆ స్టార్ హీరోయిన్లు వీళ్లే…

భూమిక..

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది భూమిక చావ్లా.. సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన ఈమె నటించింది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఓ చిత్ర డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్తతో పాటుగా సినిమాలకు వెళ్లేది. అంతే కాదు నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మించాలని అనుకుంది.. అయితే ఆమె తీసుకు నా తప్పుడు నిర్ణయం కోట్లు పోగొట్టుకునేలా చేసింది. ఆమె నిర్మించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో భారీగా నష్టాలను చవిచూసింది..

చార్మి..

టాలీవుడ్ ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కెరియర్ పిక్స్ లో ఉండగానే నిర్మాతగా మరి సినిమాలు చేయాలని అనుకుంది. ఇప్పటివరకు ఈమె అరడజను సినిమాల వరకే నిర్మించి ఉంటుంది.. ఇప్పటివరకు ఈమె ఎన్ని సినిమాలు చేసినా కూడా అందులో కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది..

దేవాయని…

ఒకప్పుడు కుర్రాల క్రష్ గా మారిన దేవయాని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే పెళ్లి తర్వాత పెద్దగా ఇండస్ట్రీలో కనిపించని ఆమె తన భర్త డైరెక్టర్ చేసిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.. అయితే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొట్టడంతో ఆమె భారీగా నష్టపోయింది..

Also Read : 'పొదరిల్లు ' చక్రీ ఇంత మోసం చేశాడా..? ఫ్యాన్స్ హర్ట్..

వీళ్లు మాత్రమే కాదు చాలామంది హీరోయిన్లు కూడా నిర్మాతలుగా, డైరెక్టర్లుగా తమ సత్తాని చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. కొంతమంది వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తూ లాభాలను పొందుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live