నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ముఖ్యంగా ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వారికి సువర్ణవకాశం అని చెప్పవచ్చు. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (RLDA) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది.
దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన సైట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 40 ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో (సివిల్/ఎలక్ట్రికల్) కనీసం 55 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి.
వయస్సు: వయోపరిమితి విషయానికొస్తే మే 22, 2026 నాటికి అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.76,000 చొప్పున వేతనం చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా అభ్యర్థుల ప్రతిభ, అనుభవంపై ఆధారపడి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హత మార్కులు, పని అనుభవం, వారు చివరిగా అందుకున్న జీతం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ప్రారంభంలో ఈ నియామకాలు ఒక ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన ఉంటాయి. అభ్యర్థుల పనితీరు, సంస్థ అవసరాలను బట్టి ఈ ఒప్పందాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉంటుంది.
చివరి తేది: ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
రైల్వే భూముల అభివృద్ధి, వాణిజ్య అవసరాల కోసం ఆర్ఎల్డీఏ కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల అవసరం ఉంది.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్ ఆర్ఎల్డీఏ అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలని అధికారులు కోరారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
అఫీషియల్ వెబ్ సైట్:https://rlda.indianrailways.gov.in/
హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!

