లీడర్ లక్షణాలు ఎలా ఉండాలె. తనను నమ్ముకుని వచ్చిన నేతలకు, కార్యకర్తలకు బాసటగా నిలవాలి. భరోసా నింపాలి. నేనున్నానే ధైర్యాన్ని ఇవ్వగలగాలి. అవకాశం రాగానే పదవులిచ్చి వారికి గౌరవం ఇవ్వాలి.
మొన్నటి దాకా పార్టీ కోసమే పనిచేసి ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాలకు ఆలంబనగా నిలవాలి. కానీ ఇక్కడ మహేశ్ గౌడ్ విషయంలో అంతా డిఫరెంట్. వారికి పదవులిచ్చే విషయంలో ఆయన వైఖరి రెండు రకాలుగా ఉంటుంది. ముఖం మీద కాగితపు పూల నవ్వు పులుముకుంటాడు.
నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన చందంగానే ఉంటుంది ఆయన వైఖరి. ఇస్తాడన్నట్టుగానే ఉంటుంది. కానీ.. అవి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు. నెలల తరబడి తాత్సాం చేస్తూ వస్తారు. బీసీ నాయకుడు పీసీసీ చీఫ్ అయ్యాడు. తమ బాధలు అర్థం చేసుకుంటారు. తగిన న్యాయం చేస్తారు. పదవులిచ్చి గౌరవిస్తారు….అనుకుని అంతా భ్రమపడ్డారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. ఆయన టైమ్ ఇవ్వరు. ఏ కార్యకర్తతోగానీ, సీనియర్ నాయకులతో కలిసి ప్రత్యకంగా సమావేశమై సందర్బాలు ఒక్కటంటే ఒక్కటి లేదు. హడావుడిగా ఉంటాడు. బీజీబిజీ షెడ్యూల్ నడుమ ఎవరినీ కలవడు.
ఎక్కడో నార్సింగిలో ఇళ్లు.. ఎవరికీ అపాయింట్‌మెంట్ ఉండదు. గాంధీభవన్‌కు వస్తే పట్టించుకునే నాథుడు లేడు. ఏదో వినతిపత్రం ఇవ్వాలే.. ఫోటో దిగానే అదే తమకు మహాద్బాగ్యం అనే రేంజ్ సీన్ అక్కడ దర్శనమిస్తాయి. మళ్లీ అధికారంలోకి వస్తామని ఓ వైపు సీఎం ఢంకా బజాయించి చెబుతా ఉంటే.. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ మాత్రం.. కార్యకర్తలకు,నాయకులకు నిరుత్సాహాన్నే మిగిల్చే విధంగా వారిని పార్టీ బలోపేతానికి కార్యోన్ముఖుల్ని చేసేలా మాత్రం కార్యాచరణ ఉండటం లేదు. ఇంటికి పెద్ద లాంటి స్టేట్ ప్రెసిడెంట్ అందరి బాగోగుల గురించి ఆలోచించాల్సింది పోయి.. చెప్పేదొకటి చేసేదొకటిలా ఆయన ప్రవర్తన, వ్యవహార శైలి అపనమ్మకాన్నే ప్రోదీ చేస్తూ వస్తోంది.
లీడర్ అంటే ఓ మాటిచ్చాడంటే అది నెరవేరుస్తాడనే నమ్మకం కలగాలి. అది కలిగించాలంటే కష్టమైనా, నష్టమైనా చేసి చూపాలి. కానీ ఇక్కడ ప్రెసిడెంట్‌కు అలాంటి లీడర్ లక్షణాలు లేవనే చెప్పాలి. తన అవసరాల మేరకు నడుచుకుని, పార్టీ పటిష్టత, కార్యకర్తల బాగోగుల విషయంలో ఒక స్పస్టమైన, నిజాయితీతో కూడిన వ్యవహార శైలి మహేశ్‌కు లేదనే చెబుతున్నారు. నైతికంగా కీలకమైన ఈ అంశంలో కూడా ఓ స్పష్టమైన క్లారిటీ మెసేజ్ వెళ్లిపోయింది క్యాడర్‌లో.
మహేశ్‌ను కలిస్తే పనులు కావు.. మాటలు చెప్పి.. మభ్యపెట్టడమే తప్ప.. అనే నిర్ణయానికి వచ్చేశారు. దీంతో ఆయయన రెండేండ్ల కాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా తనో ఫెయిల్యూర్ లీడర్ అని అనిపించుకున్నాడు. ఇప్పుడిదే ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించే ముఖ్యమైన ఘట్టంగా మారబోతున్నది.

