Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big TV Live 3 weeks ago

West Godavari: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నికల జరగకుండా ఉండాలనే లక్ష్యంతో వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.

అందులో స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరగకుండా ఉండేందుకు రకరకాల ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వాటికి ఎన్నికలు జరిగితే చిత్తు, చిత్తుగా ఓడిపోతామని తెలిసి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో ఇది మంచి పద్దతి కాదన్నారు.

మొగల్తూరు సభలో వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటే చాలదని, స్థానిక ప్రభుత్వాలు ఉండాలన్నారు. మీరు ఎన్నుకున్న పంచాయితీ, మండలం, మున్సిపాలిటీలు ఉండాలన్నారు. అప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు వారి ద్వారా దక్కుతుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకoపై గొడ్డలి పార్టీ అధినేత ఫోటో ఉండేదని, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే జనాల ముఖంపై పచ్చ బొట్లు వేస్తారని తేల్చేశారు. తాము ఏ మంచి పని చేస్తున్నా అడ్డం పడుతున్నారని, ఏజెన్సీ ఏరియాలోని పిల్లలు చదువుకుంటే వాళ్ళ మాటలు వినరని అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ నాయకులు ఎంతమంది అడ్డం వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు.

స్థానిక ఎన్నికలు జరగకుండా వైసీపీ కుట్రలు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, తాను కేవలం ఫించన్లు ఇవ్వడానికో, బటన్ నొక్కడానికో ఇక్కడకు రాలేదు. మీలో భరోసా ఇవ్వాలని వచ్చానన్నారు. ఒకప్పుడు వృద్ధులంటే భారంగా చూసేవారని, ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారని మనసులోని మాట బయటపెట్టారు. ఆ గౌరవాన్ని ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వమని అన్నారు. కాళిపట్నం భూముల సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 1745 నాటి నుంచి ఈ సమస్య ఉందన్నారు. త్వరలో కాళీపట్నం ప్రజలకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. డెల్టా మోడరైజేషన్ చేస్తామన్న ముఖ్యమంత్రి, నర్సాపురంలో మీడియం పోర్టు పెడతామన్నారు. డంపింగ్ యార్డు నరసాపురంలో ఏర్పాటు చేస్తామని, అందుకు స్థలాలు ఇవ్వలేవన్నారు.

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

దేశంలోనే నెంబర్ 1 యూనివర్సిటీగా నర్సాపురం ఆక్వా యూనివర్సిటీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి బాగా జరగాలని, అందుకోసం సలహాలు, సూచనలు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం పేదవాడిని నిలబెట్టాలి.. తాత్కాలిక ఉపశమనం ఉండాలన్నారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్సులు ఇచ్చామని అన్నారు. దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని గుర్తు చేశారు. ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేనని, ఎన్నికల్లో మీరిచ్చిన తీర్పును ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపారు. త్వరలో మహిళా డ్రైవర్ల వ్యవస్థను తీసుకొస్తామని, వడ్డెర సామాజిక వర్గానికి మైనింగ్‌ లీజులు పెట్టామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు పెంచామని, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live