Dimple Hayathi : మొన్నటి వరకు హీరోయిన్ పాత్రల్లో అందచందాలు ఒలకబోసిన ఈ 'డస్కీ బ్యూటీ' ఇప్పుడు గేర్ మార్చినట్టే కనిపిస్తుంది. యస్.. గ్లామర్ ఒలకబోసి బోర్ కొట్టిందనేమో, ఏకంగా పవర్ ఫుల్ విలన్ పాత్రలకు సై అంటుందట డింపుల్ హయాతి.
అది కూడా చిన్నా చితకా హీరోల సినిమాల్లో కాదండోయ్.. టాలీవుడ్ టాప్ హీరోస్ చిరంజీవి, బాలయ్య సినిమాల్లో.
చిరు-బాబీ (MEGA157) ప్రాజెక్ట్‌లో 'లేడీ విలన్'గా ?
చిరు సినిమాకి వస్తే.. 'సంక్రాంతికి వస్తున్నాం'తో సాలిడ్ సక్సెస్ చూసిన చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను బాబీ కొల్లితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక వీరిద్దరి కాంబోలోనే 'వాల్తేరు వీరయ్య' వంటి సాలిడ్ బ్లాస్టర్ రావడంతో మెగా 158పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.ఇక ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, తాజాగా పూజా కార్యక్రమాలు కూడా జరిపేసుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే, తాజాగా ఈ సినిమాలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి ఒక పవర్ ఫుల్ విలన్ రోల్ చేయనుందన్న వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.చూడాలి మరి.. తెరమీద ఒంపు సొంపులతో కవ్వించే ఈ హాటీ బ్యూటీ చిరుని ఎలా డీకోడుతుందో. ఇక ఈ సినిమాకి 'కాకాజీ' అని టైటిల్ పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
'బెటర్ హాఫ్' అంటే కేవలం భార్య మాత్రమేనా? ఈ పదం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా!
బాలయ్యకు ధీటుగా డీ అంటే డీ
ఇక చిరు సినిమానే కాకుండా మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య - డైరెక్టర్ గోపీచంద్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా డింపుల్ హయాతినే నెగెటివ్ రోల్‌కు సెలెక్ట్ చేశారని ఇన్‌సైడ్ టాక్.భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు ధీటుగా డీ అంటే డీ అనే పాత్రలో డింపుల్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తెర మీద గ్లామర్ డాల్‌గా కనిపించే డింపుల్‌లో విలనిజంని చూసిన ఈ ఇద్దరు దర్శకులను మెచ్చుకొని తీరాల్సిందే.ఇక ఈ సినిమాలో ఇప్పటికే నయనతార ప్లేస్‌లో కాజల్ వచ్చి చేరిందన్న సంగతి తెలిసిందే.
డింపుల్ హయాతి విషయానికి వస్తే
ఇక డింపుల్ హయాతి విషయానికి వస్తే.. 2017లో 'గల్ఫ్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, 2019లో వచ్చిన 'గద్దలకొండ గణేష్'లోని 'సూపర్ హిట్టు' అనే సాంగ్ చేసి ఓవర్‌నైట్ స్టార్‌డమ్ కొట్టేసింది. ఆ తర్వాత 'ఖిలాడి' (2022)లో రవితేజకు జోడీగా మురిపించిన ఈ ముద్దుగుమ్మ, 'రామబాణం' (2023)లో గోపీచంద్ సరసన మంచి మార్కులే కొట్టేసింది.ఇక ఈ ఏడాది పొంగల్ బరిలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న 'భర్త మహాశయులకి విజ్ఞప్తి'లో కనిపించిన డింపుల్, ఇప్పుడు ఏకంగా యూ-టర్న్ తీసుకుని విలనిజం పండిస్తానంటూ రెడీ అయిపోయింది.
మొత్తానికి నెగెటివ్ రోల్స్ అయినా, చిరు-బాలయ్య సినిమాల్లో ఒకేసారి ఛాన్స్‌లు పట్టేసి ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టేసిందన్న మాట.చూడాలి మరి.. విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై మేకర్స్ అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్‌మెంట్ ఇస్తారో!
వెంకీ 'ఆదర్శ కుటుంబం'.. పాత వైన్.. పాత సీసా! గురూజీ మరీ ఇంత రొటీనా?

