Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్క మెసేజ్ తో భార్య ఎఫైర్ బట్టబయలు. ఆ భర్త చేసిన పని చూస్తే బుర్రపాడు

ఒక్క మెసేజ్ తో భార్య ఎఫైర్ బట్టబయలు. ఆ భర్త చేసిన పని చూస్తే బుర్రపాడు

Big TV Live 4 months ago

Korean Romantic Drama: భార్యాభర్తల మధ్య బంధానికి పునాది నమ్మకం. కానీ కొన్ని అనవసరమైన కారణాల వల్ల ఆ పునాది పగిలిపోతే, బంధం బీటలు వారడానికి ఒక చిన్న మెసేజ్ కారణం అయితే ?

పచ్చగా ఉన్న కాపురంలో ఒకే ఒక్క మెసేజ్ చిచ్చు రేపితే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ-డ్రామా సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ పేరు ‘లిజన్ టు లవ్’ (Listen to Love). 2016లో విడుదలైన ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ పెళ్లయి 8 ఏళ్లు దాటిన ఒక జంట మధ్య నడిచే ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రిలేషన్‌షిప్ డ్రామా. దో హ్యున్-వూ టెలివిజన్ ప్రొడ్యూసర్ గా పని చేస్తాడు. తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అతని సంసార జీవితం చాలా హ్యాపీగా సాగిపోతోందని నమ్మే వ్యక్తి. ఆఫీసు ఒత్తిడి మధ్య కూడా ఇంటి పనుల్లో భార్యకు తోడుగా ఉండే మంచి భర్తగా మసలుకుంటాడు. ఇక హ్యున్-వూ భార్య పేరు జుంగ్ సూ-యోన్. ఒక మల్టీ టాస్కింగ్ ఉమెన్. అటు ఉద్యోగాన్ని, ఇటు ఇల్లు, పిల్లల బాధ్యతలను పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసే ఇల్లాలు.

ఆమె జీవితం బయట నుంచి చూడడానికి చాలా సంతోషంగా కనిపిస్తుంది. కానీ అంతలోనే కథలో ఒక ఆందోళనకరమైన ట్విస్ట్ వస్తుంది. ఒకరోజు హ్యున్-వూ అనుకోకుండా తన భార్య సూ-యోన్ ఫోన్‌ చూస్తాడు. అందులో ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ను చూశాక ఆమె ఈ వీకెండ్ ఒక హోటల్‌ లో మరొక వ్యక్తిని కలవబోతోందని తెలుస్తుంది. కానీ అతను ఈ ఒక్క మెసేజ్ తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను అపార్థం చేసుకుంటాడు. ఈ విషయం తెలిసి హ్యున్-వూ పూర్తిగా కుంగిపోతాడు. నేరుగా భార్యను అడగలేక, తన స్నేహితులకు చెప్పలేక సతమతమవుతాడు.

ఎలాగైనా తన పెళ్లి బంధాన్ని కాపాడుకోవాలనే ఆశతో, అతను ఒక ఆన్‌లైన్ ఇంటర్నెట్ ఫోరమ్‌లో అనామక పేరుతో తన సమస్యను పోస్ట్ చేస్తాడు. హ్యున్-వూ పెట్టిన పోస్ట్‌ కు వేలాది మంది నెటిజన్లు స్పందిస్తారు. రకరకాల సలహాలు, సూచనలు ఇస్తారు. కొందరు అతని భార్యను తప్పుబడితే, మరికొందరు ఆమె అలా మారడానికి గల కారణాన్ని వెతకమంటారు. ఈ పోస్ట్ ద్వారా హ్యున్-వూ తన భార్య అడుగుజాడలను కనిపెట్టడం మొదలు పెడతాడు. అంటే ఆమె ఎటు వెళ్ళినా ఓ కంట కనిపెడుతూ ఉంటాడు.

చివరికి వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ ఎలా కలిశారు ? ఆమె బాధ ఏమిటి ? హ్యున్-వూ తన భార్యను తిరిగి గెలుచుకోవడానికి ఏం చేశాడు ? అనే విషయాలను ఎంతో ఎమోషనల్‌గా, కాస్త కామెడీ మిక్స్ చేసి ఈ సిరీస్‌లో చూపించారు. మొత్తం 12 ఎపిసోడ్‌లతో సాగే ఈ వైవాహిక జీవిత బంధాల సిరీస్, నేటి తరం జంటలకు ఒక మంచి మెసేజ్‌ను అందిస్తుంది. ప్రేమను కాపాడుకోవాలంటే ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇందులో చూసి తెలుసుకోవచ్చు. ‘లిజన్ టు లవ్’ (Listen to Love) ప్రస్తుతం Hotstarలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. అలాగే ఒరిజినల్ కొరియన్ వెర్షన్ ను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో Netflixలో కూడా చూడవచ్చు.

అందం కోసం ఫ్రెండ్స్ చర్మాన్ని ఒలిచే సైకో పిల్ల… తినేటప్పుడు మాత్రం ఈ సినిమాను చూడొద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live