Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ. 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ. 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

Big TV Live 1 week ago

Untold Raygun OTT : ఒలింపిక్స్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేదు… కానీ ప్రపంచం మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంది. ఆమె చేసిన డ్యాన్స్ మూవ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, మీమ్స్, ట్రోలింగ్, విమర్శలు వరదలా వచ్చాయి.

అసలు ఆమె ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించింది ? ఏదైనా మోసం జరిగిందా ? లేక నిజంగానే అర్హత సాధించిందా ? 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేకింగ్ అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియన్ బీ-గర్ల్ రాచెల్ గన్, అలియాస్ రేగన్ కథ ఇప్పుడు ఓటీటీలో డాక్యుమెంటరీగా మారింది. ‘Untold Raygun: Breaking Badly’ పేరుతో వచ్చిన ఈ స్పోర్ట్స్ డాక్యుమెంటరీలో ఆమె ఒలింపిక్స్‌కు చేరిన ప్రయాణం, ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన తీరు, ఆ తర్వాత ఎదుర్కొన్న ట్రోలింగ్, తప్పుడు ప్రచారం, మానసిక ఒత్తిడి వంటి విషయాలను ఆమె స్వయంగా చెబుతుంది. మరి ప్రపంచం ఆమెను ఎందుకు టార్గెట్ చేసింది ? ఆ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

రాచెల్ గన్ యూనివర్సిటీ అకడమిక్‌ గా పని చేసిన వ్యక్తి. బ్రేకింగ్‌ లోకి అడుగు పెట్టిన ఆమె క్రమంగా ఈ డాన్స్ కల్చర్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2023 WDSF ఓషియానియా బ్రేకింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచి, ఆస్ట్రేలియా తరఫున పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2024లో బ్రేకింగ్ తొలిసారి ఒలింపిక్స్‌లో భాగం కావడంతో ఆమెపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ పారిస్‌లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ఊహించని విధంగా వైరల్ అయింది. కంగారూ హాప్, స్ప్రింక్లర్ లాంటి మూవ్స్‌తో చేసిన ఆమె రొటీన్‌ కు ఒక్క జడ్జి ఓటు కూడా రాలేదు. అయినా ఆమె ఒక్క రాత్రిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సరదా మీమ్స్ కాస్తా తీవ్రమైన ట్రోలింగ్‌ గా మారాయి. ఆమె ఒలింపిక్స్‌కు ఎలా ఎంపికైందనే విషయంలో తప్పుడు ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

డాక్యుమెంటరీ ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. రేగన్ తన అనుభవాన్ని, ఒలింపిక్ వేదికపైకి వెళ్లే ముందు ఎదురైన భయాన్ని, వైరల్ అయిన తర్వాత తనపై పడిన మానసిక భారాన్ని వివరిస్తుంది. కుటుంబ సభ్యులు, భర్త శామ్యూయేల్ ఫ్రీ, ఆమెకు పరిచయమైన ఇతర బీ-గర్ల్స్ కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అయితే ఈ కథ ఆమె ఓడిపోయిందా లేదా అన్న విషయం గురించి కాదు. ఒక వ్యక్తి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక మీమ్‌గా మారినప్పుడు అతని జీవితంపై ఆ ప్రభావం ఎలా పడుతుంది అనే పాయింట్ తో నడుస్తుంది.

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

తెలుగులో అందుబాటులో ఉందా?

చాప్‌మన్ వే, మాక్‌లైన్ వే దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సుమారు 72 నిమిషాల నిడివి ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇంగ్లీష్ భాషలో రూపొందింది. ప్రస్తుతం తెలుగు ఆడియో లేదు. ఒలింపిక్స్, డ్యాన్స్, సోషల్ మీడియా వివాదాలు వంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ డాక్యుమెంటరీలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అందుకే ఇదొక డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా. ముఖ్యంగా వైరల్ అయిన కొన్ని నిమిషాల వెనుక ఒక మనిషి ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలంటే దీన్ని చూడొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live