Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒరేయ్ నఖ్వీ నీకు అసలు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా కప్ దాస్తావురా ?

ఒరేయ్ నఖ్వీ నీకు అసలు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా కప్ దాస్తావురా ?

Big TV Live 2 weeks ago

Asia Cup 2025 trophy - Mohsin Naqvi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ (Asia Cup 2025 Tournament) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లోని టీమిండియా, ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో… పాకిస్తాన్ జట్టును ఓడించింది.

ఈ క్రమంలోనే ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఉన్న నేపథ్యంలో అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేదు సూర్య కుమార్ యాదవ్. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వ్యవహరించిన పాకిస్తాన్ క్రికెటర్లను అవమానించిన సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav)…. ఇప్పుడు టైటిల్ కూడా తీసుకోకుండానే ఇండియాకు వచ్చేశారు.

Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

ఒరేయ్ నఖ్వీ నీకు అసలు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా కప్ దాస్తావురా ?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ (Asia Cup 2025 Tournament) విజేతగా టీమిండియా నిలువగా… ట్రోఫీ మాత్రం సూర్య కుమార్ యాదవ్ తీసుకోలేదు. ఈ క్రమంలో ఈ టైటిల్ ఇప్పటికి కూడా మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) కి దగ్గరే ఉంది. అతని ఆఫీసులో భద్రంగా ఆ ట్రోఫీని దాచి పెట్టాడు మొహ్సిన్ నఖ్వీ. రూల్స్ ప్రకారం టోర్నమెంట్ ముగిసిన నెల రోజులలోపే… గెలిచిన జట్టుకు ట్రోఫీ అప్పగించాలి. అది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న రూల్. కానీ మొహ్సిన్ నఖ్వీకు మాత్రం చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ… ట్రోఫీని తన దగ్గర పెట్టుకున్నాడు.

ఆసియా కప్ 2025 టోర్నమెంటు (Asia Cup 2025 Tournament) పూర్తయి ఏడాది కావస్తున్నా, టీమిండియా కు ( Team India) టైటిల్ పంపించడం లేదు. మధ్య వర్తి ద్వారా ఈ టోర్నమెంటు పంపించే ఛాన్స్ మొహ్సిన్ నఖ్వీకి ఉంది. కానీ అలా చేయకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆఫీస్ లోనే ఆ ట్రోఫీని భద్రపరిచాడు. అయితే దీనికి సంబంధించిన ఫోటో తాజాగా వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పక్కోడి కష్టాన్ని దొబ్బేసిన నక్వికి కొంచెం కూడా సిగ్గు లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఎందుకు సూర్య కుమార్ యాదవ్ టైటిల్ తీసుకోలేదు ?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలిచినప్పటికీ టైటిల్ మాత్రం తీసుకోలేదు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. పహల్గాం సంఘటన జరిగిన నేపథ్యంలో ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య బంధాలు తెగిపోయాయి. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని బీసీసీఐ నుంచి టీమ్ ఇండియా ప్లేయర్లకు ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీదుగా టైటిల్ అందుకునేందుకు వెనకడుగు వేశాడు.

ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌలర్లకు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగకుండా మాస్టర్ ప్లాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live