Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలో మాయాజాలంలో ముంచెత్తే క్రేజీ సిరీసులు. ఇందులో మీరెన్ని చూశారు ?

ఓటీటీలో మాయాజాలంలో ముంచెత్తే క్రేజీ సిరీసులు. ఇందులో మీరెన్ని చూశారు ?

Big TV Live 2 weeks ago

Adventure Fantasy Thrillers OTT : ఈ రోజు మన మూవీ సజెషన్ లో మూడు పాపులర్ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం. వీటిని చూస్తున్నంతసేపు అస్సలు టైం తెలీదు.

పైగా ఈ సిరీస్ లలో యాక్షన్ తో పాటు ఊహించని ట్విస్టులు, టర్నులు కూడా ఉంటాయి. మరి ఆ 3 క్రేజీ సిరీసులు ఏంటో తెలుసుకుందాం పదండి.

Dead Boy Detectives (2024)

మాములుగా మనుషులకు ఏమన్నా సమస్యలు ఉంటే పోలీసుల దగ్గరకు వెళ్తారు. వాళ్ళే కేసును నమోదు చేసుకుని, దర్యాప్తు చేసి సాల్వ్ చేస్తారు. కానీ ఈ సిరీస్ లో మాత్రం ఇద్దరు దెయ్యాలు ఆత్మల కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తాయి. చార్లెస్ రోలాండ్, ఎడ్విన్ పేన్ అనే ఇద్దరు టీనేజ్ దయ్యాలే ఆ దెయ్యాలు. ఈ ఇద్దరు దెయ్యం అబ్బాయిలు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్లకుండా, భూమిపైనే ఉండి ఇతర దెయ్యాల కేసులను పరిష్కరిస్తుంటారు. వీరికి క్రిస్టల్ అనే సైకిక్ అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది. డెత్ (Death) నుండి తప్పించుకుంటూ, మంత్రగత్తెలు - దయ్యాల మిస్టరీలను ఛేదిస్తూ పాపులర్ అవుతారు. ఈ సిరీస్ ప్రస్తుతం Netflix లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. 'డెడ్ బాయ్ డిటెక్టివ్స్' నీల్ గైమాన్ 'ద సాండ్‌మాన్' యూనివర్స్‌ నుంచి వచ్చింది.

Percy Jackson and the Olympians (2023)

గ్రీకు సముద్ర దేవుడైన పోసిడాన్ కొడుకే 12 ఏళ్ల పర్సీ జాక్సన్. అతను సెమీ గాడ్. జ్యూస్ అనే మరో దేవుడి ఆయుధం 'మాస్టర్ బోల్ట్' దొంగతనం నింద పర్సీపై పడుతుంది. తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి, రానున్న మహా యుద్ధాన్ని ఆపడానికి తన స్నేహితులు అన్నబెత్, గ్రోవర్‌తో కలిసి పోరాటం చేస్తాడు. ఈ సిరీస్ ను JioHotstarలో తెలుగులో కూడా చూడవచ్చు. 'పర్సీ జాక్సన్' రిక్ రియోర్డాన్ పుస్తకాల ఆధారంగా తెరకెక్కింది.

Lockwood & Co (2023)

మనుషులను దెయ్యాలు తాకితే చనిపోయే వింత లోకం నేపథ్యంలో సాగే కథ ఇది. ఇక్కడ కేవలం పిల్లలకు మాత్రమే దెయ్యాలను చూసే శక్తి ఉంటుంది. ఆంథోనీ లాక్‌వుడ్, లూసీ, జార్జ్‌లతో కలిసి ఘోస్ట్-హంటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తాడు. ఈ సిరీస్ Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. 'లాక్‌వుడ్ అండ్ కో' సిరీస్ రెండో సీజన్ ను నెట్ ఫ్లిక్స్ ఆపేసింది. ఈ 3 సిరీస్ లు కూడా ఆడియన్స్ ను చూస్తున్నంత సేపూ మ్యాజిక్ లో ముంచేస్తాయి. అలాగే ఇందులో యాక్షన్ కు కొదవేం లేదు. అంతేనా ఫాంటసీ, అడ్వెంచర్ లాంటి అన్నీ జానర్లు మిస్ అయ్యి ఉన్న మాస్టర్ పీసుల్లా ఉంటాయి ఒక్కో సిరీస్. మరి ఇందులో మీరెన్ని చూశారు ? ఒకవేళ ఈ లిస్ట్ లో ఉన్న సిరీస్ లలో ఏ ఒక్కటి మిస్ అయినా మంచి సిరీసును చూడకుండా ఆగిపోయినట్టే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live