Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాత 2 స్ట్రోక్ కైనెటిక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ DX+ వరకు.. 40 ఏళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బెంగళూరు వ్యక్తి!

పాత 2 స్ట్రోక్ కైనెటిక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ DX+ వరకు.. 40 ఏళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బెంగళూరు వ్యక్తి!

Big TV Live 1 week ago

కైనెటిక్ స్కూటర్.. ఒకప్పుడు భారతీయ కుటుంబాల్లో ఎంతగానో గుర్తింపు పొందింది. ముఖ్యంగా 1980, 90లలో ఈ స్కూటర్లు యువతలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి.

ఇప్పుడు, అదే బ్రాండ్ కొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ మార్కెట్లోకి వచ్చి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన 40 ఏళ్ల నాటి 2-స్ట్రోక్ కైనెటిక్ స్కూటర్‌ ను ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచుకొని, ఇప్పుడు కొత్త కైనెటిక్ DX+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాత, కొత్త కైనెటిక్ స్కూటర్ల కథ!

ఈ వీడియోను వాకింగ్‌వయోలినిస్ట్‌ లైఫ్‌ స్టైల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. ఇందులో కనిపిస్తున్న స్కూటర్ సౌత్ ఇండియాలో డెలివరీ చేసిన మొదటి కైనెటిక్ DX+ EVగా చెబుతున్నారు. ఈ వీడియోను బెంగళూరులోని విధాన సౌధ సమీపంలో తీశారు. స్కూటర్ యజమాని కొత్త DX+ మోడల్‌ను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పాత కైనెటిక్ హోండా స్కూటర్‌ ను గుర్తు చేస్తోందని చెప్పారు.

కొత్త కైనెటిక్ స్కూటర్ గురించి..

కొత్త కైనెటిక్ DX+ డిజైన్ పూర్తిగా రెట్రో స్టైల్‌ లో, ఆధునిక టెక్నాలజీతో కలిపి రూపొందించారు. స్కూటర్‌ కు పూర్తి మెటల్ బాడీ ఇచ్చారు. ముందుభాగంలో LED హెడ్‌ ల్యాంప్ ఉండగా, బాణం ఆకారంలో ఉన్న టర్న్ ఇండికేటర్లు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో కైనెటిక్ లోగో మెరుస్తూ ఉండేలా డిజైన్ చేశారు. అలాగే బ్రాండ్ లోగో డేటైమ్ రన్నింగ్ లైట్‌ గా కూడా పని చేస్తుంది.

స్కూటర్ సైడ్ ప్యానెల్స్, ఎయిర్ వెంట్స్, ఫ్రంట్ మడ్‌ గార్డ్ లాంటివి పాత కైనెటిక్ స్కూటర్‌ ను గుర్తు చేసేలా రూపొందించారు. వెనుక భాగంలో కొత్త స్టైలిష్ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. సీటు వెడల్పుగా, సౌకర్యంగా ఉండి ఇద్దరూ సులభంగా కూర్చునేలా డిజైన్ చేశారు. ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పాత మోడల్‌కు దగ్గరగా ఉండేలా రూపొందించినప్పటికీ, ఇప్పుడు డిజిటల్ డిస్‌ ప్లేను అందించారు. స్కూటర్ స్విచ్‌ లు కూడా క్లాసిక్ స్టైల్‌ లో ఉన్నాయి. అంతేకాదు, ఫిజికల్ కీప్యాడ్ ద్వారా స్కూటర్‌ ను లాక్, అన్‌ లాక్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో కైనెటిక్ కొన్ని క్రేజీ ఫీచర్లను కూడా ఇచ్చింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ ఉండటం వల్ల 16 AMP సాకెట్‌ కు నేరుగా కనెక్ట్ చేసి ఛార్జ్ చేయవచ్చు. సీటు కింద 37 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. అలాగే మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ కూడా ఇచ్చారు. స్కూటర్ 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ పై నడుస్తుంది.

ఒకే ఛార్జ్ తో 105 కి.మీ ప్రయాణం

కైనెటిక్ DX+లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. రేంజ్ మోడ్‌లో స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. పవర్ మోడ్‌లో 70 కిలోమీటర్ల వరకు వేగం అందుతుంది. టర్బో మోడ్‌లో గరిష్ట వేగం 90 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ 2.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒకే ఛార్జ్‌ తో 105 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కైనెటిక్ DX రెండు వేరియంట్లలో లభిస్తోంది. DX వేరియంట్ ధర రూ.1.11 లక్షలు కాగా, DX+ వేరియంట్ ధర రూ.1.17 లక్షలుగా ఉంది. పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పట్ల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

Read Also: కొత్త టియాగో EV vs పాత టియాగో EV.. నయా మోడల్ లో క్రేజీ అప్ డేట్స్ ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live