Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయంటే..

పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయంటే..

Big TV Live 2 days ago

Gold prices Today: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు వేళ బులియన్ మార్కెట్‌పై ప్రభావం కనిపిస్తోంది. దీనికితోడు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఈ పరిణామాల కారణంగా బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

దిగొస్తున్న పసిడి ధరలు

పసిడి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. గడిచిన రెండు రోజులు బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మళ్లీ ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అటు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పతనమయ్యాయి. గడిచిన రెండురోజులుగా 5 శాతానికి పైగా పతనం అయ్యింది. దీంతో ప్రస్తుతం 80 డాలర్ల దిగువకు చేరింది.

పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధర

ఇక బంగారం విషయానికి వద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4100 డాలర్లకు చేరింది. మంగళవారంతో పోల్చితే 4050 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు 60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ. 95.38 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. పసిడి ధర స్వల్పంగా దిగొచ్చింది. ఉదయం 9 గంటల లోపు మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్-విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,32,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ. 220 పతనమైంది. ప్రస్తుతం రూ. 1,44,000 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో వెండి ధర అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీకి రూ .2.35 లక్షల వద్ద కంటిన్యూ అవుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,140గా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో హైదరాబాద్ ధర కనిస్తోంది.

యూపీఐ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రూ.2,000 దాటితే ఛార్జీల మోత.. రానున్న మార్పులివే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live