Pawan Kalyan Birthday: సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం తన రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు(Pawan Kalyan Birthday) రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన సోదరుడు నాగబాబు సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ కోసం కళ్యాణం జరిపించారు.
రావి వేప చెట్టుకు కళ్యాణం..
నాగబాబు(Nagababu) జనసేన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఇటీవల ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ (Ap Green Executive committe Chairman)గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇలా నాగబాబు ఆగస్ట్ 28వ తేదీ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగబాబు తన భార్య పద్మజతో కలిసి ముందస్తుగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జరిపించారు. ఇందులో భాగంగా ఈయన సతీసమేతంగా రావి-వేప (అశ్వత్థ-నింబ) జంట వృక్షాలను నాటి, మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వాటికి కళ్యాణం జరిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆరోగ్యకరమైన వాతావరణం..
ఇలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈయన మొక్కలు నాటి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి నాగబాబు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 50% పచ్చదనం కనిపించేలా చేయడమే మా బాధ్యత అంటూ తెలిపారు. రాబోయేతరాలకు పరిశుభ్రమైన వాతావరణం, కలుషితం లేని గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడమే మా లక్ష్యం అని తెలిపారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని కాపాడి పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు నాగబాబు తెలిపారు. ఈ హరిత యజ్ఞాన్ని ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని నాగబాబు ఈ సందర్భంగా తెలియజేశారు.
నాగబాబు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈయన ఇటీవల సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగుతున్నారు. ఇలా ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగుతూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలలో కూడా బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్న నాగబాబుకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవిని అందించారు. ఇక ప్రస్తుతం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ పర్సన్ గా క్యాబినెట్ లో హోదా కల్పించిన విషయం తెలిసిందే.

