Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

Big TV Live 1 week ago

Jana Sena: పార్టీ పెట్టిన పుష్కర కాలానికి జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న యువజన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

యువతను కేవలం పవన్ అభిమానులుగా కాకుండా.. పార్టీకి క్షేత్రస్థాయి కార్యకర్తలుగా, భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమా అన్న చర్చ మొదలైంది.

స్థానిక ఎన్నికలు..

జనసేన యువజన విభాగం అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్నది కూడా కీ డిబేట్ గా మారింది. సో ఓవరాల్ గా చూస్తే చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయ్. స్థానిక ఎన్నికలు జనసేనకు కేవలం కూటమి భాగస్వామ్యాన్ని పరీక్షించేలా మారబోతున్నాయ్. టీడీపీ, వైసీపీకి ధీటుగా జనసేనను ఏపీలో నిలపాలన్న ప్లాన్ కనిపిస్తోంది. బలమున్న ప్రాంతాల్లో పోటీ చేసి.. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేనను బలంగా నిలిపే ఉద్దేశం కనిపిస్తోంది.

Also read: టార్గెట్ కేసీఆర్.. స్పీడ్ పెంచిన సీఎం రేవంత్!

పన్నెండేళ్ల తర్వాత..

అయితే సోషల్ మీడియాలో కొన్ని సెటైర్లు పడుతున్నాయ్. పార్టీ పెట్టి పన్నెండేళ్ల తర్వాత యువజన విభాగం ఏర్పాటు చేయడమా… ఇన్నాళ్లూ పార్టీ నిర్మాణంపై ఎందుకు సీరియస్ గా దృష్టి పెట్టలేదన్న ప్రశ్నలైతే వస్తున్నాయ్. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live