Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రొడక్షన్ డిజైనర్!

పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రొడక్షన్ డిజైనర్!

Big TV Live 2 weeks ago

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా.. బాలీవుడ్ తార జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు భాషా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో జగపతిబాబు , దివ్యేందు శర్మ, వీజీ చంద్రశేఖర్, సత్య, శివరాజు కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా వరుస వార్తలు అంచనాలు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. ముఖ్యంగా సినిమా చూశాక కన్నీళ్లు పెట్టుకోవడం గ్యారెంటీ అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయి.

పెద్ది సినిమా ఫస్ట్ రివ్యూ..

జూన్ 4వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “నా 10 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను.. ఇన్నేళ్ల నా కెరియర్లో ఒక కథకి ఇంతలా కనెక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి. డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు నేను సాధారణ స్థితికి రాలేకపోయాను. అంతలా నన్ను ఈ కథ కదిలించింది. కథలో డెప్త్ ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ఆడియన్స్ కి సెట్ అని తెలియకూడదు. అప్పుడే ఒక ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. ఇది “వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిలిం”.. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పెద్ది జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు”. అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు అవినాష్.

ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026.. విజేతలు వీరే!

ఆ సెట్స్ అన్నీ రీ క్రియేట్ చేశాం – అవినాష్

అలాగే ఆయన మాట్లాడుతూ.. ” ముఖ్యంగా ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక కుస్తీ సెటప్ మేం చేసాము. అండర్ గ్రౌండ్ సెట్ అప్ లో కూడా షూట్ చేశాము. చరణ్ గదతో కనిపించిన షాట్ కూడా అక్కడే చేయడం జరిగింది. ఇందులో ఒక హిల్ స్టేషన్ ఊరు కావాలి. అది హైదరాబాదులోని ఒక బూత్ బంగ్లాలో వేసాము. ఇక దానిని మీరు తెరపై చూసినప్పుడు ఒక కొండ కింద ఉన్న ఊరిలా మీకు అనిపిస్తుంది . ఇకపోతే విజయనగరం ఏరియాలో జరిగే కథ ఇది అక్కడి వీధులు, క్లాక్ టవర్ అన్నీ కూడా రీ క్రియేట్ చేసాము.. పైగా విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక కుస్తీ , క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఈ కథలో చాలా బలం ఉంది ” అంటూ తెలిపారు అవినాష్. ఏది ఏమైనా ఆయన దీని గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ మాటలు వింటుంటే ఇప్పుడే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మరి తెరపై ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live