Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా బాలయ్య ?

పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా బాలయ్య ?

Big TV Live 3 days ago

Balayya for Peddi Event:పెద్ది ..పెద్ది..పెద్ది .. సినిమా జూన్ 4 న థియేటర్ల లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుండటంతో టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి.

RRR, గేమ్ చేంజర్ సినిమాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామా కావడం, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేసవి బరిలో నిలుస్తున్న అతిపెద్ద సినిమా ఇదే కావడంతో వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

భోపాల్‌లో మరో గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌

ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసేలా మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారట. ఇందులో భాగంగానే ఇటీవల ముంబైలో నిర్వహించిన 'పెద్ది' అఫీషియల్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also read :ఓర్మాక్స్ 2026 రిపోర్ట్.. బాలీవుడ్‌కు మైండ్ బ్లాంక్.. దేశంలోనే నంబర్ 1 స్టార్‌గా రెబల్ స్టార్ రేంజ్!

రామ్ చరణ్ మాస్ లుక్, బుచ్చిబాబు టేకింగ్ బాలీవుడ్ మీడియాను సైతం ఆకట్టుకున్నాయి. ఈ జోష్‌ను ఇలాగే కొనసాగిస్తూ మే నెల చివరి వారంలో భోపాల్‌లో మరో గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అక్కడి స్థానిక యూనివర్సిటీ గ్రౌండ్స్ లో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో వరుసగా ప్రెస్ మీట్స్, రోడ్ షోలు నిర్వహించనున్నారట .

నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా

ఇక సినిమా రిలీజ్ వారానికి సరిగ్గా రెండు రోజుల ముందు, అంటే జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక లేదా ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

Also read :స్టార్ హీరోల టార్గెట్ తట్టుకోలేక ముంబై చెక్కేసారా? సునీల్ నారంగ్ ప్లాన్ బి ఇదేనా?

ఈ టాక్ వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం వెంకట సతీష్ కిలారు నిర్మాణంలోనే బాలకృష్ణ తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 111వ చిత్రం 'NBK 111' చేస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డాకు మహారాజ్' లాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య చేస్తున్న లైనప్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే ప్రొడక్షన్ హౌస్‌లో రెండు భారీ సినిమాలు ట్రాక్‌లో ఉండటంతో, నిర్మాత సతీష్ కిలారు స్వయంగా బాలకృష్ణను ఈ వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిర్మాత మాట్లాడుతూ, తమ బ్యానర్ ఈవెంట్‌కు ఒక పెద్ద స్టార్ రాబోతున్నారంటూ చిన్న హింట్ ఇవ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

'పెద్ది' సృష్టించే బాక్సాఫీస్ విధ్వంసం వేరే లెవెల్‌

మరోవైపు నందమూరి, మెగా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చరణ్‌ను తన సొంత బిడ్డలా భావిస్తానని బాలయ్య అన్ స్టాపబుల్ ఈవెంట్లో ఓపెన్‌గా ప్రకటించారు కూడా.ఈ నేపథ్యంలో జూన్ 2న జరిగే 'పెద్ది' వేడుకకు బాలకృష్ణ విచ్చేసి చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ స్టేజ్‌పై నటసింహం సందడి చేస్తే థియేటర్ల దగ్గర హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కలయిక నిజమైతే జూన్ 4న థియేటర్లలో 'పెద్ది' సృష్టించే బాక్సాఫీస్ విధ్వంసం వేరే లెవెల్‌లో ఉంటుంది. మేకర్స్ నుంచి ఈ గెస్ట్ ఎంట్రీపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్టుగా బాలయ్య నిజంగా వస్తాడో లేక వార్తలు రూమర్స్ గానే మిగిలిపోతాయో !

Also read :సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ పోతినేని వీడియో.. అసలు విషయం తెలిసి ఫిదా అవుతున్న టాలీవుడ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live