Dailyhunt
పెళ్లి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. అంత మాట అనేసిందేంటి..?

పెళ్లి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. అంత మాట అనేసిందేంటి..?

Big TV Live 1 week ago

Actress Swathi : బుల్లితెరపై యాంకర్లుగా ఇండస్ట్రీకి పరిచయమై తమ టాలెంట్ తో సినిమాల్లో అవకాశాలను తెచ్చుకుంటున్నారు.. యాంకర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ అయిన ముద్దుగుమ్మలో కలర్స్ స్వాతి ఒకరు.

కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి హీరోయిన్ గా కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. అష్టా చమ్మా మూవీ తో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండానే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. కెరీర్ పీక్స్ ఉండగానే పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత సినిమాలకు చాలా కాలం గ్యాప్ తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

భర్త ఫోటోలను డిలీట్ చేసిన హీరోయిన్..

సినిమా హీరోయిన్లు ప్రేమలో పడడం, పెళ్లిలు చేసుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది.. కొంతమంది హీరోయిన్లు తమ బంధాన్ని జీవితాంతం ఉండేలా చేసుకుంటారు. కానీ మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం భర్తలతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్స్ స్వాతి ఒకరు. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వికాస్ వాసు అనే ఒక ఫైలెట్ ని ఆమె ప్రేమించింది. 2018లో పెద్దలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలని డిలీట్ చేశారు.. దాంతో హీరోయిన్స్ స్వాతి భర్తతో విడాకులు తీసుకున్న అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అంతే కాదు గతంలో ఈమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మొగుడు కన్నా.. కుక్క బెటర్..

ఆమె గతంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందులో ఆమె మాట్లాడుతూ కొందరు అబ్బాయిలు అమ్మాయిలని ఆకర్షించేందుకు ఐ లవ్ యు అనే ఒక పదాన్ని వాడేస్తారు. లేదా పెళ్లి చేసుకుంటాను అని అంటారు. తనని కూడా ఎంతోమంది అబ్బాయిలు ఇలానే ప్రపోజ్ చేశారని ఆమె ఇంటర్వ్యూలో బయటపెట్టారు. పెళ్లి అంటే చాలా బాధ్యతలతో కూడిన విషయం అని చెప్పింది. బయట కనిపించేంత సింపుల్ కాదు అని చెప్పింది. ఇదే కాదు ఒక దశలో ఆమె పెళ్లి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం మేలు అనిపించిందని ఆ వీడియోలో చెప్పింది. సడన్గా స్వాతి అంత మాట అనడానికి కారణం ఏంటి? తన భర్తతో విడాకులు తీసుకుని ఇప్పుడు సోలో లైఫ్ బతుకుతుందా? ఓ హీరో తో ప్రేమాయణం నడుస్తుంది అంటూ వచ్చిన వార్తలు నిజమేనా? ఇలాంటి ప్రశ్నలు కూడా జనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకు హీరోయిన్స్ స్వాతి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..

స్వాతి సినిమాల విషయానికొస్తే..

16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఎంతోమంది స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసింది. అప్పట్లోనే హీరోయిన్గా అవకాశాలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కూడా హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించింది. అనంతపురం, అష్టాచమ్మా సినిమాలలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. స్వామి రారా.. కార్తికేయ వంటి సూపర్ హిట్ చిత్రాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live