Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

Big TV Live 2 weeks ago

GDP Growth: తాజాగా భారత జీడీపీ 7.8 వృద్ధి శాతం ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్న టైంలో ఇది చిన్న విషయం కాదు.

దేశీయ వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం భారత వృద్ధికి ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ చెబుతున్న స్వదేశీ మంత్రానికి అసలు అర్థం.. విదేశీ వస్తువులు, సేవలపై ఆధారపడటాన్ని తగ్గించి.. దేశీయ ఉత్పత్తి, తయారీ, పెట్టుబడులు, ఉపాధిని పెంచడమే.

కానీ వృద్ధి నెంబర్ పెరిగితే సరిపోతుందా..? సామాన్యుడి జేబులో ఆదాయం పెరుగుతోందా? రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులు, నిత్యవసరాల ధరలు సవాళ్లు కాదా? యువతకు ఉద్యోగాలు, ఉపాధి ఉంటోందా?

భారత తయారీ ప్రపంచ మార్కెట్లలో చైనాకు పోటీగా నిలుస్తోందా? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయ్. ఎందుకంటే 2047 లక్ష్యం నినాదాలతో కాదు.. నిరంతర అధిక వృద్ధి, భారీ పెట్టుబడులు, ప్రొడక్టివిటీ, బలమైన మానవ వనరులతోనే సాధ్యం. ఈ వృద్ధి ఒక బలమైన అడుగు మాత్రమే. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కావాలంటే.. ఇదే వేగాన్ని దశాబ్దాల పాటు కొనసాగించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live