Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేరుకే 3D ప్లేయర్‌..కానీ చివరి ఓవర్ లో ఒక్క పరుగు కూడా చేయడం చేతకాదు

పేరుకే 3D ప్లేయర్‌..కానీ చివరి ఓవర్ లో ఒక్క పరుగు కూడా చేయడం చేతకాదు

Big TV Live 1 week ago

Vijay Shankar Batting In LPL: లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Lanka Premier League 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 18 మ్యాచ్ ల వరకు పూర్తయ్యాయి.

అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో 3 D ప్లేయర్ గా పాపులర్ అయిన విజయ్ శంకర్ (Vijay Shankar) మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. చివరి ఓవర్ లో 22 పరుగులు చేయాల్సి ఉండగా… ఒక్క పరుగు కూడా చేయకుండా విఫలమయ్యాడు. అదే కాకుండా చివరి బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో విజయ్ శంకర్ జిడ్డు బ్యాటింగ్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

ఓరీ దరిద్రుడా…6 బంతుల్లో ఒక్క సింగిల్ కూడా చేయలేవా?

లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Lanka Premier League 2026) భాగంగా జాఫ్నా కింగ్స్ vs క్యాండీ రాయల్స్ (Jaffna Kings vs Kandy Royals) మధ్య 18 వ మ్యాచ్ జరిగింది. పల్లెకేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో క్యాండీ రాయల్స్ 20 ఓవర్లలో 200 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్ లో విజయ్ శంకర్ బ్యాటింగ్ కు దిగి, టార్గెట్ ఛేదించే ఛాన్స్ ఉన్నప్పటికీ విఫలమయ్యాడు.

విజయ్‌ శంకర్ ను తొలగించాలని డిమాండ్లు

లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా క్యాండీ రాయల్స్ జట్టు తరఫున విజయ్ శంకర్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో 21 బంతుల్లో 25 పరుగులు సాధించి ఔట్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో చివరి ఆరు బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో స్ట్రైకింగ్ లో విజయ్ శంకర్ ఉన్నాడు. 3D ప్లేయర్ గా పేరు పొందిన విజయ్ శంకర్, దిల్షాన్ మదుశంక (Dilshan Madushanka) బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. చివరి ఓవర్ లో దిల్షాన్ మదుశంక 6 బంతులు వేయగా… విజయ్ శంకర్ ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు. చివరి బంతికి విజయ్ శంకర్ ఔట్ కూడా అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో జఫ్నా కింగ్స్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 3 D ప్లేయర్ విజయ్ శంకర్ పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు, లంకా ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Lanka Premier League 2026) నుంచి విజయ్ శంకర్ ను (Vijay Shankar) తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌలర్లకు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగకుండా మాస్టర్ ప్లాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live