Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

Big TV Live 1 week ago

Instant Soft Dosa: ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ఉన్నప్పుడు లేదంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసుకునే సమయం లేనప్పుడు 10 నిమిషాల్లోనే చేసుకునే టిఫిన్ కావాలనుకుంటే..

ఈ బియ్యం లేకుండా చేసే మెత్తటి దోసె బెస్ట్ ఛాయిస్. ఇంట్లో ఉన్న కొద్ది పదార్థాలతోనే ఈ దోసెను సులభంగా తయారవుతుంది. బయట హోటల్‌లో తిన్నట్టు మెత్తగా, రుచిగా వస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

కావాల్సిన పదార్థాలు:

శనగపిండి – 1 కప్పు
పెరుగు – అర కప్పు
రవ్వ – అర కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి ముక్కలు – 1 టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నీరు – సరిపడా
నూనె – దోసెల కోసం

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

తయారీ విధానం:

మొదట ఒక బౌల్‌లో శనగపిండి, రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. అవసరమైనంత నీరు పోసి దోసె పిండిలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన ఉంచితే దోసెలు ఇంకా మెత్తగా వస్తాయి.

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె రాయాలి. ఒక గరిటె పిండిని పోసి నెమ్మదిగా దోసెలా చల్లాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే… వేడి వేడి మెత్తటి దోసెలు సిద్ధం. వీటిని కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live