Chain Snatching: స్వేచ్ఛ బ్యూరో: మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ వినాయకనగర్ కాలనీలో చైన్‌స్నాచింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన మహిళను టార్గెట్ చేసిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని సుమారు ఐదు తులాల బంగారు పుస్తెల త్రాడును అపహరించి పరారయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం..
వినాయకనగర్ కాలనీ రోడ్ నంబర్-1లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడి మాణిక్యప్ప సతీమణి కావడి అనిత (56) గురువారం సాయంత్రం ఇంటి ముందు కాలనీ రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె వద్దకు చేరుకుని మాటల్లో పెట్టి అకస్మాత్తుగా మెడలోని మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కొన్నారు. బాధితురాలి మెడలో ఉన్న మంగళసూత్రంలో రెండు పుస్తెలు, గుండ్లు, లక్ష్మీ బిళ్లతో కూడిన సుమారు ఐదు తులాల బంగారం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also read: 5 గోనే సంచులు.. 60 ప్యాకెట్లు.. ఈ గంజాయి విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిదే!
జంకుతున్న జనం..
ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహిళ కేకలు వేయగా, అప్పటికే దుండగులు బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు.పగటిపూటనే జనసంచారం ఉన్న కాలనీలో ఈ ఘటన జరగడం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. వరుసగా జరుగుతున్న చైన్‌స్నాచింగ్ ఘటనలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.బాధితుడు కావడి మాణిక్యప్ప ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
lso read: ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

