Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Podarillu Today Episode : పెద్దోడికి పెళ్ళాం దొరికేసిందోచ్..చక్రీని ఇరికించేసిన ప్రతాప్.. మహా నిజం చెప్తుందా..?

Podarillu Today Episode : పెద్దోడికి పెళ్ళాం దొరికేసిందోచ్..చక్రీని ఇరికించేసిన ప్రతాప్.. మహా నిజం చెప్తుందా..?

Big TV Live 1 week ago

Podarillu Today Episode May 29th : శైలు కేశవతో ఒక్క రీల్ అయిన చేయాలి అని అనుకుంటుంది. అయితే కేశవ దానికి ఒప్పుకోకపోవడంతో చోటుని అడుగుతుంది. చోటు ఒప్పుకుంటాడు కానీ కేశవ పెట్టిన కండిషన్ వల్ల అతను భయపడిపోయి మెకానిక్ చేసుకునే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు..

శైలు మళ్లీమళ్లీ వద్దన్నా కూడా రావడంతో కేశవ సీరియస్ అయితే శైలు పారుయిపోతుంది.. కానీ చివరికి చోటుకి అనుమానం రావడంతో శైలుని నిజమడుగుతాడు.. ఇక శైలు తన మనసులోని మాటని చోటుతో చెప్తుంది. శైలు కేశవ గురించి అడగడం కేశవ వింటాడు. మీ అన్నయ్యకి సంబంధం ఏమైనా చూడమంటావా అని అడుగుతుంది. కేశవ మాత్రం మా అన్నయ్య కాబోయే భార్య ఎక్కడ పుట్టి ఉంటుంది అని అంటాడు. కానీ మా అన్నయ్యని వెతుక్కుంటూ వస్తుంది అని కేశవ్ అంటాడు..

పెద్దోడికి జోడీ దొరికేసింది..

మాధవ్ సైకిల్ టైర్ పంచర్ అయింది అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఈ సైకిల్ తోసుకుంటూ ఇప్పుడు సైట్ వరకు వెళ్తే అక్కడ చాలా టైం అవుతుంది తిడతారు అని అనుకుంటాడు. అయితే ఇక్కడ పెట్టి ఆటో కి వెళ్లి వచ్చేటప్పుడు తిరిగి తీసుకొని వెళ్ళచ్చు అని మాధవ్ అనుకుంటాడు. సీరియల్లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఒక హిందీ అమ్మాయి వచ్చి పోయే ఆటోలని ఆపుతూ ఉంటుంది. ఒక ఆటో ఆపగానే మాధవ్ కూడా అందులోకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఈ క్రమంలో ఇద్దరు గుద్దుకుంటారు.. ఆమెకు తెలుగు రాక ఇబ్బందులు పడుతుంది. దానికి మాధవ్ ఆ కొత్తమ్మాయి ఇద్దరు కలిసి ఒకే ఆటోలో ప్రయాణం చేస్తారు.. వీరిద్దరిని చూస్తుంటే త్వరలోనే పెద్దోడికి పెళ్ళాం అయ్యేలా కనిపిస్తుంది.. వీళ్ళిద్దరూ కలిసి మొత్తానికి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటారు.. తనకి డబ్బులు ఇవ్వడంలో హెల్ప్ చేసిన మాధవ్ కి థాంక్స్ చెప్తుంది..

మహాను చూసి హారిక షాక్..

మహా సిరి పాప దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావ్ ఏదో కష్టపడుతున్నట్లు ఉన్నావే అని అడుగుతుంది.. ఇవాళ స్కూల్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ మహా.. ఈ బుక్ లోని వాటిని నేను మెదడులో డమ్ చేసుకుంటున్నాను అని అంటుంది.. ఇలా చేస్తే నీకు బుర్రలోకి ఎక్కుతాయ్ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది..ఇలా చేస్తే నిజంగానే ఎక్కుతాయంట మా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు చెప్పింది అని సిరి పాప అంటుంది.. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది వదిన అని హారికతో అంటుంది.. అయితే సినిమాకు వెళ్తావా అని హారిక అడుగుతుంది.. ఈ ఎండకి సినిమాకు వద్దు గుడికి వెళ్దామని చెప్పగానే హారిక షాక్ అవుతుంది.. మహా హారిక ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు.

ప్రతాప్, ఆదిలను రెచ్చగొట్టిన చక్రీ..

హాల్లో కూర్చుని ప్రతాప్ అలాగే ఆదిలు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రి మాత్రం అటూ ఇటూ ఏదో పోయినట్లు వెతుకుతూ ఉంటారు.. ఏంటి దేని గురించి వెతుకుతున్నారు అని ప్రతాప్ అడుగుతారు.. అయితే అది ఏంటి మీ ఇంట్లో పెట్టుకునేటివి వెతుకుతున్నావని అడుగుతాడు.. మా ఆవిడ అదే మీ ఇంటి గౌరవం ఎక్కడికి పోయిందో కనిపించడం లేదు అని అంటాడు. ఆది ప్రతాప్ ఇద్దరు కూడా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావా గన్ పెట్టి షూట్ చేస్తాము అని అంటారు. మీరు ఏదో చేస్తారని నాకు అర్థమైంది అందుకే మా వాళ్ళకి నాకు ఏమైనా అయితే మీరే కారణం అని చెప్పి వచ్చాను.. వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు అని చెక్రి వాళ్లకి వార్నింగ్ ఇస్తాడు.. చక్రి కె మహా మెసేజ్ పెడుతుంది.. నేను గుడికి వచ్చాను అని చెప్పగానే చక్రీక మహాతో మెసేజ్ చేస్తూ ఉంటాడు.

చక్రిని అవమానించిన ప్రతాప్..

చక్రి బయట మహాలక్ష్మితో మెసేజ్ చేస్తూ ఉంటాడు. అయితే లలిత నేను సిరిని స్కూల్లో వదిలిపెట్టాలి అని అంటుంది.. అయితే హారిక చూసుకుంటుంది కదమ్మా నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని ఆది అంటాడు.. హారిక మహాతో కలిసి గుడికి వెళ్ళింది.. నేను ఇప్పుడు సిరిని తీసుకెళ్లాలి అని అనగానే డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అని ప్రతాప్.. డ్రైవరు జ్వరం వచ్చిందని సెలవు తీసుకున్నాడు కదా ఇప్పుడు ఎలా అని ఆది అంటాడు.. డ్రైవర్ ఇలారా అని చక్రిని పిలుస్తారు.. మేడంని స్కూల్ దగ్గర దిగబెట్టి మళ్లీ తీసుకురావాలి అని చెప్పగానే చక్రి తనదైన స్టైల్ లో కౌంటర్లు వేస్తాడు. అయితే ఆది నీకు వచ్చిన పని ఇదే కదా వెళ్లి తీసుకురా అని వార్నింగ్ ఇస్తాడు..

చక్రీని ఇరికించిన ప్రతాప్..

రాత్రి భోజనం చేస్తూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. చక్రిని ఎవరు పిలవలేదా అని అడుగుతుంది.. దానికి ప్రతాప్ నేనే దగ్గర నుండి పిలిచాను అమ్మ కానీ తను రాలేదు అని అబద్ధం చెప్తాడు. ఇక లలిత మాత్రం వడ్డించమని చెప్పగానే ఉన్న కూరలన్నీ కావాలని చక్రి ప్లేట్లో వడ్డిస్తుంది.. ఇక చక్రి చదువు గురించి ప్రతాప్ కావాలనే టాపిక్ తీసుకొని వస్తాడు. అల్లుడుని బాగా అర్థం చేసుకున్నాను ఇక మన బిజినెస్ లలో అల్లుడు కూడా భాగం పంచుకుంటాడు అని ప్రతాప్ అంటాడు. కానీ చక్రి మాత్రం ఏదో జరుగుతుంది నన్ను ఏదో చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. మహా మాత్రం నేను ఇక్కడ ఉన్నను నా గోల్ని రీచ్ అవ్వాలి అని అంటుంది. అయితే మహాలక్ష్మి అభూషణ్ గురించి చెప్తుంది. చక్రి తో జరిగిన పెళ్లి అబద్ధం అని చెప్పాలని అనుకుంటుంది మహాలక్ష్మి.. కానీ చక్రి నిజం చెప్తే తనని ఏదైనా చేస్తారేమో అని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి కి దిమ్మతిరిగే షాక్.. కూపి లాగుతున్న బాలు, మీనా.. విద్య నిజం చెప్తుందా..? ఇదేం ట్విస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live