Viral Singer : సోషల్ మీడియా పుణ్యాన టాలెంట్ ఎక్కడ ఉన్నా క్షణాల్లో బయటపడిపోతుంది.ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండ్ లో ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతున్నారో చెప్పడం కష్టం.
తాజాగా తెలంగాణకు చెందిన ఒక మహిళా పోలీస్ తనదైన గొంతుతో నెట్టింటిని షేక్ చేస్తుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ ఫిలిమ్ 'రణబాలి' లోని 'ఏందయ్యా సామీ' అనే పాటను ఆమె పాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.
పోలీస్ యూనిఫామ్ ఉన్నప్పటికీ
మాములుగా పోలీస్ అంటే రఫ్ గా ఉంటారని, కేసుల గొడవల్లో మునిగిపోయి ఉంటారని,లా అండ్ ఆర్డర్ కే అంకితమై ఉంటారని భావిస్తాం. కానీ వాళ్ళలో కూడా అద్భుతమైన కళాకారులు దాగి ఉన్నారని ఈ వీడియో మరోసారి ప్రూవ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆ మహిళా పోలీస్ తన బిజీ షెడ్యూల్ మధ్యలో 'రణబాలి'లోని 'ఏందయ్యా సామీ'ని అధ్బుతంగా పాడింది. పోలీస్ యూనిఫామ్ ఉన్నప్పటికీ ఎక్కడా ఆర్బాటం, బెరుకు లేకుండా ఆమె పాడిన తీరు చూస్తుంటే పాటల పట్ల తనుకున్న ఆమెకున్న ఇష్టం ఏంటో తెలుస్తుంది..ఆమె గొంతులోని స్వచ్ఛత, పాటలోని భావం వింటుంటే అచ్చం ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగానే ఉందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు .
కొన్ని గంటల్లోనే తెగ వైరల్
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఇలా వచ్చిందో లేదో కొన్ని గంటల్లోనే తెగ వైరల్ అయిపొయింది."టాలెంట్‌కు యూనిఫామ్ అడ్డు కాదు","పోలీస్ డ్యూటీలో ఉన్నప్పటికీ ఇంత సెన్సిబుల్ గా ఒక పాటని పాడటం మెచ్చుకోతగ్గ విషయం అంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సాంగ్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది కూడా. అయితే వేల సంఖ్యలో రీల్స్, కవర్ సాంగ్స్ వస్తున్నప్పటికీ, ఈ మహిళా పోలీస్ పాడిన పాట మాత్రం హైలెట్ అనే చెప్పాలి.
భార్యాభార్తలయ్యాక వస్తున్న మొదటి సినిమా
ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా భార్యాభార్తలయ్యాక వస్తున్న మొదటి సినిమా కావడంతో 'రణబాలి' పై భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఇదే కాంబోలో వచ్చిన 'గీత గోవిందం' (2018)సూపర్ హిట్ కాగా 'డియర్ కామ్రేడ్' (2019) బాక్సాఫీస్ వద్ద పర్లేదనిపించుకుంది. ఇక దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగి ఈ జోడీ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.ఇక ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. 'టాక్సీవాలా' (2018), 'శ్యామ్ సింగరాయ్' (2021) వంటి హిట్ సినిమాలకి దర్శకత్వం వహించింది ఈయనే. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా బాలీవుడ్ ద్వయం అజయ్-అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మొత్తానికి 'రణబాలి'సినిమాకి వస్తున్న హైప్ ఒక ఎత్తయితే, మహిళా పోలీస్ పాడిన పాటతో వచ్చిన హైప్ మరో ఎత్తు. చూడాలి మరి ఇదే బాటలో సోషల్ మీడియా పుణ్యాన ఇంకెంత మంది తమ టాలెంట్ బయపెడతారో !

