Dailyhunt
Power Saving Tips: విద్యుత్ బిల్లును అమాంతం పెంచేసే.. ఈ 15 అలవాట్ల గురించి తెలుసా?

Power Saving Tips: విద్యుత్ బిల్లును అమాంతం పెంచేసే.. ఈ 15 అలవాట్ల గురించి తెలుసా?

Big TV Live 1 week ago

Power Saving Tips: వేసవిలో విద్యుత్ బిల్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు అధిక మెుత్తంలో విద్యుత్ ను వినియోగిస్తుంటాయి.

అయితే వీటివల్లే నూటికి నూరు శాతం పవర్ బిల్లు అధికంగా వస్తుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా కొందరి రోజూవారి అలవాట్లు కూడా విద్యుత్ బిల్లును పెంచవచ్చని పేర్కొంటున్నారు. పవర్ బిల్లును పెంచేందుకు ప్రధానంగా కారణమవుతున్న 15 అలవాట్లు ఏవి? వాటికి ఏ విధంగా చెక్ పెట్టాలో ఈ కథనంలో చూద్దాం.

అనవసరంగా లైట్లు వేయడం

గది నుండి బయటకు వచ్చేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపకపోవడం వల్ల అనవసరంగా విద్యుత్ ఖర్చవుతుంది.

పాత బల్బుల వాడకం

సాధారణ ఫిలమెంట్ బల్బులు లేదా ట్యూబ్ లైట్ల కంటే ఎల్ఈడీ బల్బులు 75-80% తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి.

స్టాండ్‌బై మోడ్

టీవీ, కంప్యూటర్, ఓవెన్ స్విచ్ ఆఫ్ చేసినా, ప్లగ్ పాయింట్ దగ్గర మెయిన్ స్విచ్ ఆపకపోతే అవి కొంత శక్తిని వాడుకుంటూనే ఉంటాయి.

చార్జర్లను ప్లగ్ చేసే ఉంచడం

ఫోన్ లేదా లాప్‌టాప్ చార్జింగ్ పూర్తయిన తర్వాత కూడా చార్జర్‌ను సాకెట్‌లోనే ఉంచడం వల్ల విద్యుత్ వృధా అవుతుంది. ఫలితంగా పవర్ బిల్లు పెరగొచ్చు.

ఫ్రిడ్జ్‌ను తరచూ తీయడం

ఫ్రిడ్జ్‌ తలుపును మాటిమాటికీ తీయడం వల్ల లోపల చల్లదనం తగ్గి.. కంప్రెసర్ మళ్ళీ ఎక్కువ సేపు పని చేయాల్సి రావొచ్చు.

ఫ్రిడ్జ్‌లో వేడి పదార్థాలు

వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిడ్జ్‌లో పెడితే.. దాన్ని చల్లబరచడానికి ఫ్రిడ్జ్‌ రెట్టింపు శక్తిని వాడుకుంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగి కరెంటు బిల్లు ఎక్కువ రావొచ్చు.

ఓవెన్ డోర్ తీసి చూడటం

వంట అయ్యేటప్పుడు ఓవెన్ తలుపు తీస్తే లోపలి వేడి 25 డిగ్రీల వరకు తగ్గిపోతుంది. దీనివల్ల వంట ఆలస్యమై బిల్లు పెరిగే ఛాన్స్ ఉంది.

ఏసీ ఉష్ణోగ్రత

ఏసీని 18°C – 20°C మధ్య ఉంచడం కంటే 24°C నుండి 26°C మధ్య ఉంచడం వల్ల బిల్లు చాలా తగ్గుతుంది.

ఫిల్టర్ల క్లీనింగ్

ఏసీ, కూలర్ ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే గాలి సరిగ్గా రాక మిషన్ మీద భారం పడుతుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరిగి.. పవర్ బిల్లు అధికంగా రావొచ్చు.

కిటికీలు, తలుపులు తెరవడం

ఏసీ ఆన్ చేసినప్పుడు గదిని పూర్తిగా క్లోజ్ చేయాలి. అలాకాకుండా కిటికీలు తలుపులు తెరిచి ఉంచితే.. చల్లదనం బయటకు పోతుంది. ఫలితంగా గదిని కూల్ చేసేందుకు ఏసీ మరింత విద్యుత్ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది.

గీజర్‌ను ఆన్ చేయడం

కొందరు గీజర్ ను ఆన్ చేసి అలాగే వదిలేస్తారు. స్నానానికి గంట ముందే గీజర్ ఆన్ చేయడం, వాడిన తర్వాత ఆపడం మర్చిపోవడం వల్ల బిల్లు భారీగా పెరుగుతుంది.

తక్కువ బట్టలతో వాషింగ్

కొందరు తక్కువ బట్టలు ఉన్నప్పుడు కూడా వాషింగ్ మిషన్ ఆన్ చేస్తుంటారు. బట్టలు తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా వాషింగ్ మిషన్ ఒకటే విద్యుత్ ను తీసుకుంటుంది. మిషన్ సామర్థ్యానికి తగ్గట్లు బట్టలు వేసి.. ఉతకడం వల్ల విద్యుత్ ను ఆదా చేయవచ్చు.

వాటర్ హీటర్

బకెట్ నీళ్ల కోసం హీటర్ రాడ్ వాడేటప్పుడు చాలా విద్యుత్ ఖర్చవుతుంది. సాధ్యమైనంత వరకు సోలార్ హీటర్లు వాడితే విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు.

పాత వైరింగ్

ఇంట్లో వైరింగ్ పాతదైతే విద్యుత్ లీకేజీ జరిగి బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వైరింగ్ పాతగా అయినట్లు గుర్తిస్తే వాటి స్థానంలో కొత్తవి వేయించడం బెస్ట్.

Vijay Alliance Buzz: విజయ్‌ను వెంటాడుతోన్న 11.. సింహం సీఎం కావాలంటే, పొత్తే దిక్కు!

కర్టెన్లు వేయకపోవడం

వేసవిలో కిటికీల నుండి ఎండ నేరుగా లోపలికి వస్తే గది వేడెక్కుతుంది. దీనివల్ల ఏసీ, కూలర్, ఫ్యాన్ ఎక్కువ సేపు వాడాల్సి వస్తుంది.

రూ. 123, రూ.234, రూ.369.. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్లాన్స్.. బోలెడన్ని బెనిఫిట్స్ భయ్యా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live