Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే. ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే. ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big TV Live 1 week ago

The Runner OTT : ఓ సాధారణ ఉదయం… కొడుకును స్కూల్‌లో దింపిన ఓ లాయర్ జాగింగ్‌ కు బయలుదేరుతుంది. కానీ కొన్ని నిమిషాల్లోనే ఆమె ఫోన్‌ కు ఓ షాకింగ్ కాల్ వస్తుంది.

తన కొడుకును కిడ్నాప్ చేశామని, అతని ప్రాణాలు దక్కాలంటే తాను చెప్పిన పని చేయాలని ఓ మిస్టరీ వ్యక్తి ఆదేశిస్తాడు. ఆ పని కూడా ఏదో చిన్న పని కాదు, తాను కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ కీలక సాక్షిని చంపాలి. ఇక అక్కడి నుంచి ఆమెకు ఒక్క గంట సమయం మాత్రమే. ఆగితే కొడుకు ప్రాణాలు పోతాయి, పోలీసులను సంప్రదిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. లండన్ వీధుల్లో పరుగులు తీస్తూ, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఆదేశాలను పాటిస్తూ, తన కొడుకును కాపాడుకోవడానికి పోరాడే తల్లి కథే ‘The Runner’. మరి ఆమెను ఈ డేంజర్ గేమ్‌లోకి లాగింది ఎవరు ? కొడుకును ఎందుకు టార్గెట్ చేశారు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మైయా మార్టెన్ లండన్‌ లో పని చేసే విజయవంతమైన లాయర్, తన చిన్న కొడుకు నోహ్‌ తో కలిసి జీవిస్తుంటుంది. ఒక ఉదయం నోహ్‌ను స్కూల్‌లో దింపిన తర్వాత మైయా పరుగెత్తుకుంటూ తన పని వైపు వెళ్తుండగా ఓ మిస్టరీ కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి నోహ్‌ను కిడ్నాప్ చేశానని చెబుతాడు. అంతేకాదు అతని ఇన్సులిన్ పరికరాన్ని హ్యాక్ చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టినట్లు హెచ్చరిస్తాడు.

కొడుకును బతికించుకోవాలంటే మైయా ఒక కీలక సాక్షిని హత్య చేయాలని ఆదేశిస్తాడు. ఆమెకు గడువు కూడా కేవలం గంటే. దీంతో మైయా లండన్ అంతా పరుగులు తీస్తూ ఆదేశాలను పాటించాల్సి వస్తుంది. ఎవరినీ నమ్మలేని పరిస్థితి, వెనుక పోలీసులు, ముందే తెలియని ప్రమాదాలు, మరోవైపు కొడుకు ప్రాణాలు. ప్రతి అడుగులోనూ ఆమెకు కొత్త సమస్య ఎదురవుతుంది.

అయితే మైయా కేవలం ఆదేశాలు పాటించే తల్లిగా ఉండిపోదు. తనను ఈ ఆటలోకి లాగిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతని అసలు లక్ష్యం ఏంటి ? కిడ్నాప్ వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎంత పెద్దది ? తాను చంపాల్సిన సాక్షి దగ్గర ఏ రహస్యం ఉంది ? చివరికి మైయా తన కొడుకును కాపాడుతూ ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడగలదా ? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన అసలు థ్రిల్.

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

తెలుగులో చూడొచ్చా ?

గాల్ గాడట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 2 నుంచి Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. కెవిన్ మెక్‌డొనాల్డ్ దర్శకత్వం వహించారు. గాల్ గాడట్ తో పాటు డామియన్ లూయిస్, రోరీ విల్మాట్, ఆల్ఫ్రెడ్ ఎనోక్, ఫీనిక్స్ డి సబాస్టియాని తదితరులు నటించారు. సుమారు 84 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా రియల్ టైమ్ రేస్-ఎగైనెస్ట్-ది-క్లాక్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. కిడ్నాప్, టైమ్ లిమిట్, మైండ్ గేమ్స్, లండన్ వీధుల్లో సాగే హై టెన్షన్ ఛేజ్ తో ఇదొక ఫాస్ట్ పేస్డ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. కాబట్టి యాక్షన్ ప్రియులు డోంట్ మిస్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live