Electric Scooter Offers 2026:గత కొంతకాలంగా దేశంలో ఈవీ స్కూటర్ల కొనుగోలు పెరిగింది. సిటీ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొంటున్నా.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫైనాన్స్ సదుపాయాలు చాలా సులభంగా మారాయి. తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు లభిస్తున్నాయి. కొత్త స్కూటర్ కొనడం ఇప్పుడు అంత కష్టం అనిపించం లేదు. నెలవారీ EMIలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడళ్లకు రూ. 2,600 నుంచి రూ. 5,000 మధ్యలోనే EMIలు ప్రారంభమవుతున్నాయి.
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో Ola S1 Pro, Ather 450X, TVS iQube మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇవి సుమారు రూ.1.3 లక్షల నుంచి రూ.1.6 లక్షల ధరలతో లభిస్తున్నాయి. ఈ మోడళ్లపై బ్యాంకింగ్ ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లు, అదనపు వారంటీలు కూడా అందిస్తున్నారు.
⦿ ఓలా ఎలక్ట్రిక్
ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, కొత్త S1 సిరీస్ మోడళ్లకు మంచి ఫైనాన్స్ ఆప్షన్లు ఉన్నాయి. కొన్ని వేరియంట్లు నెలకు సుమారు రూ. 5,000 EMIతో అందుబాటులో ఉంటే, బేసిక్ వేరియంట్ల ధర రూ. 2,600 నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్ కు తగ్గట్టు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ ఏథర్
ఇక ఏథర్ కంపెనీ కూడా తన స్కూటర్లపై ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. ఏథర్ రిజ్టా లాంటి కొత్త మోడళ్ల ధరలు సుమారు రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఏథర్ 450X మోడల్ పై కూడా తక్కువ వడ్డీతో ఫైనాన్స్ లభిస్తోంది. ఈ స్కూటర్ నగర ప్రయాణాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.
⦿ హీరో విడా
హీరో గ్రూప్ నకు చెందిన విడా బ్రాండ్ కూడా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని స్కూటర్లను అందిస్తోంది. వీటి ధరలు సుమారు రూ.82,000 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటాయి. బడ్జెట్ పరంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి.
⦿ కోమాకి
అటు కోమాకి లాంటి కంపెనీలు కూడా ఎక్కువ రేంజ్ కలిగిన స్కూటర్లను అందిస్తున్నాయి. కొన్ని మోడళ్లు ఒకే ఛార్జ్ తో 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తున్నాయి. ఇవి సుమారు రూ. 90,000 ధరలో లభిస్తున్నాయి. ఇంకా తక్కువ బడ్జెట్ ఉన్నవారికి కూడా పలు ఆప్షన్లు ఉన్నాయి. రూ. 50,000 లోపు ధరలో లభించే స్కూటర్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. తక్కువ దూరాలకు అనుకూలంగా ఉంటాయి.
ఫైనాన్స్ విషయానికి వస్తే, ప్రముఖ బ్యాంకులు ఈవీల కొనుగోలుకు సపోర్టు చేస్తున్నాయి. ICICI Bank, HDFC Bank, State Bank of India, Axis Bank లాంటి సంస్థలు తక్కువ డౌన్ పేమెంట్‌తో లోన్లు అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుని కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకుంటున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు కూడా కొంతవరకు సాయపడుతున్నాయి. ఆధార్ ఆధారంగా కొన్ని పథకాల కింద సబ్సిడీలు పొందే అవకాశం ఉంది.
Read Also: మళ్లీ రోడ్లపైకి పాత చేతక్.. జస్ట్ రూ. 70 వేలకే రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్!

